Kajal Aggarwal Son : కొడుకు కోసం కాజల్ అగర్వాల్.. స్పెషల్ గా రూమ్ ఎలా డిజైన్ చేయించిందో చూడండి..

తాజాగా కాజల్ అగర్వాల్ తన కొడుకు కోసం స్పెషల్ గా రూమ్ ని డిజైన్ చేయించింది.

Kajal Aggarwal Son : కొడుకు కోసం కాజల్ అగర్వాల్.. స్పెషల్ గా రూమ్ ఎలా డిజైన్ చేయించిందో చూడండి..

Kajal Aggarwal Designs a Special Cute Room for Her Son Neil Kitchlu

Updated On : July 18, 2024 / 9:10 AM IST

Kajal Aggarwal Son Room : కాజల్ అగర్వాల్ కరోనా సమయంలో వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2022 ఏప్రిల్‌లో పండంటి బాబు జ‌న్మించాడు. కాజల్ తన కొడుకుకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టింది. అప్పుడప్పుడు కాజల్ తన కొడుకు ఫోటోలు, తన కొడుకుతో ఫ్యామిలీ అంతా దిగిన ఫోటోలు, ఫ్యామిలీ ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మళ్ళీ సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా కాజల్ అగర్వాల్ తన కొడుకు కోసం స్పెషల్ గా రూమ్ ని డిజైన్ చేయించింది. కాజల్ తన కొడుకు రూమ్ లో చేయించిన స్పెషల్ డిజైన్స్ తో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి అలా అందంగా తయారుచేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ పోస్టులు చేసింది.

Also Read : Prabhas – Amitabh : ఇవన్నీ ప్రభాస్ కి మాములు విషయం.. ప్రభాస్ గురించి అమితాబ్ ఏమన్నాడంటే..?

కాజల్ అగర్వాల్ కొడుక్కి సపరేట్ రూమ్ ఉండగా అందులో చిన్ని బెడ్ ఉంది. ఆ బెడ్ పై బొమ్మల షేప్ లో ఉన్న దిండ్లు, దాని పై నీల్ అని రాసి ఉన్నాయి. కూర్చోడానికి టెడ్డి బేర్ షేప్ లో ఉన్న చిన్ని కుర్చీ ఉంది. అలాగే రూమ్ లోని గోడలన్నిటిని జంతువుల బొమ్మలతో అందంగా డిజైన్ చేయించింది. ఈ రూమ్ ఫొటోలు చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎంతైనా ఇలా సెలబ్రిటీల ఇళ్లల్లో పుడితే లివింగ్ వేరేలా ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ తనయుడి రూమ్ భలే క్యూట్ గా ఉంది అంటున్నారు.