Ashwini Dutt : వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు.. కానీ.. కల్కి నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా నిర్మాత అశ్వినీదత్ తన వైజయంతి మూవీస్ నిర్మాణసంస్థ పెట్టి 50 ఏళ్ళు అయిన సందర్భంగా, కల్కి సినిమా పెద్ద హిట్ అయిన సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Kalki Producer Ashwini Dutt Interesting Comments on YS Jaganmohan Reddy

Ashwini Dutt – YS Jagan : కల్కి సినిమా నిర్మాత అశ్వినీ దత్ మొదట్నుంచి కూడా ఎన్టీఆర్ అభిమాని, తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని అందరికి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసారు కూడా. సినిమాల పరంగా ఎలా ఉన్నా రాజకీయాల విషయంలో తెలుగుదేశానికి పూర్తి మద్దతు ఇస్తారు అశ్వినీదత్.

అయితే గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ అవ్వగా అరెస్ట్ కు వ్యతిరేకంగా చాలా మంది బయటకి వచ్చి మాట్లాడారు. నిర్మాత అశ్వినీదత్ కూడా ఆ సమయంలో బయటకి వచ్చి చంద్రబాబు అరెస్టుని ఖండించారు. అయితే 600 కోట్ల భారీ కల్కి సినిమా రిలీజ్ సమయంలో ఇలా బయటకి వచ్చి చంద్రబాబుకి సపోర్ట్ గా మాట్లాడటం, అప్పటి ప్రభుత్వానికి వ్యతికంగా మాట్లాడటంతో అంతా ఆశ్చర్యపోయారు. సినిమా రిలీజ్ దగ్గర పెట్టుకొని ప్రభుత్వ సహకారం కావాల్సిన సమయంలో ఇలా మాట్లాడారు ఏంటి అని పలువురు కామెంట్స్ కూడా చేసారు.

Also Read : Kalki – Prabhas : బుక్ మై షోలో ‘కల్కి’ సినిమాతో సరికొత్త రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. ఏ హీరోకి ఈ రికార్డ్ లేదుగా..

తాజాగా నిర్మాత అశ్వినీదత్ తన వైజయంతి మూవీస్ నిర్మాణసంస్థ పెట్టి 50 ఏళ్ళు అయిన సందర్భంగా, కల్కి సినిమా పెద్ద హిట్ అయిన సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ ఝాన్సీ కల్కి లాటి పెద్ద సినిమా రిలీజ్ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలా ఎలా మాట్లాడారు అని అడిగింది. దీనికి అశ్వినీ దత్ సమాధానమిస్తూ.. ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడమే మా నాన్న గారు నాకు నేర్పించారు. మొహమాటం లేకుండా మాట్లాడమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఎక్కడా డిఫర్ అవ్వలేదు. ముందు ఆయన చాలా ఫ్రెండ్లిగానే ఉండేవారు. మా రెండో అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చారు ఆయన. కానీ చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన రోజూ మాత్రం వెళ్లి చాలా ఎమోషనల్ గా మాట్లాడాను. 160కి పైగా సీట్స్ వస్తాయి, చంద్రబాబు గారే సీఎం అవుతారు అని చెప్పాను. ఆ రేంజ్ కి వెళ్లి మాట్లాడాను అని అన్నారు. దీంతో అశ్వినీదత్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు