Music Shop Murthy : ఓటీటీలో దూసుకుపోతున్న ఎమోషనల్ హిట్ సినిమా.. అస్సలు మిస్ అవ్వకండి..

కామెడీతో, ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించింది మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా.

Ajay Ghosh Chandini Chowdary Music Shop Murthy Movie Streaming in OTT

Music Shop Murthy : సీనియర్ నటుడు అజయ్ ఘోష్, చాందినీ చౌదరి మెయిన్ లీడ్స్ లో ఆమని, భానుచందర్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ గత నెల జూన్ 14న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం అందుకుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు ఈ సినిమాని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కామెడీతో, ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించింది మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా.

మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఇప్పుడు ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌ ఈ రెండు ఓటీటీల్లో మ్యూజిక్ షాప్ మూర్తి స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో వచ్చిన దగ్గర్నుంచి మంచి వ్యూయర్ షిప్ సంపాదించుకుంది ఈ సినిమా. ఒకవేళ థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఉంటె ఈ సినిమాని ఓటీటీలో కచ్చితంగా చూడండి.

Also Read : Nani – Chiranjeevi : నాని వాయిస్‌తో.. మెగాస్టార్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గొప్పతనం విన్నారా..?

మ్యూజిక్ షాప్ మూర్తి కథ విషయానికొస్తే.. వినుకొండలో మూర్తి(అజయ్ ఘోష్) ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ క్యాసెట్లు అద్దెకిచ్చి, పాటలు ఎక్కించడం, ఫంక్షన్స్ కి సౌండ్ సెటప్ పెట్టి పాటలు ప్లే చేయడం చేస్తూ ఉంటాడు. సంపాదన చాలక ఇంట్లో తన భార్య(ఆమని) కూడా కష్టపడుతూ సంపాదన లేదు ఆ మ్యూజిక్ షాప్ అమ్మేసి సెల్ ఫోన్ షాప్ పెట్టుకుందాం అంటూ పోరుతూ ఉంటుంది. మూర్తి ఓ పార్టీలో పాటలు మిక్స్ చేసి బాగా ప్లే చేయడంతో అందరూ అభినందించి DJ అయి ఉంటే బాగుండేది, బాగా డబ్బులు ఇస్తారు అని చెప్పడంతో తన కష్టాలు తీరడానికి అయినా డబ్బుల కోసం DJ అవ్వాలనుకొని ఆన్లైన్ లో దాని గురించి తెలుసుకుంటూ ఉంటాడు.

మరో పక్క DJ అవ్వాలనుకునే అంజనా(చాందిని)ని తండ్రి(భాను చందర్) ఎందుకు ఆ DJ అని తిడుతూ ఉంటాడు. ఓ రోజు వాళ్ళిద్దరికీ జరిగిన గొడవలో అంజనా తండ్రి DJ కన్సోల్(DJ ప్లే చేసే పరికరం)ని పగలగొడతాడు. దాని రిపేర్ కోసం ఊరంతా తిరుగుతూ మ్యూజిక్ షాప్ మూర్తి వద్దకు వస్తుంది అంజనా. DJ కన్సోల్ బాగు చేస్తా కాని తనకి DJ నేర్పించమని మూర్తి అడగడంతో అతనికి మ్యూజిక్ పై ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఓకే చెప్తుంది. మరి అంజనా మూర్తికి DJ నేర్పిందా? మూర్తి DJ అయ్యాడా? మూర్తి, అంజనా ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే ఊళ్ళో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మూర్తి భార్య సపోర్ట్ చేసిందా? DJ అవ్వాలని హైదరాబాద్ వచ్చి మూర్తి పడ్డ కష్టాలేంటి తెలియాలంటే సినిమా చూసేయండి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా చిత్రీకరించి ఇంటర్వెల్ ముందు నుంచి ఎమోషనల్ గా కథని నడిపించి కన్నీళ్లు పెట్టిస్తారు.

ట్రెండింగ్ వార్తలు