Prabhas – Amitabh : ఇవన్నీ ప్రభాస్ కి మాములు విషయం.. ప్రభాస్ గురించి అమితాబ్ ఏమన్నాడంటే..?

తాజాగా అమితాబ్ బచ్చన్ కల్కి సినిమా విజయంపై మాట్లాడిన వీడియోని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

Amitabh Bachchan Interesting Comments on Prabhas and Kalki 2898AD Movie Success

Prabhas – Amitabh : ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. కల్కి విజయం పై అభిమానులు, మూవీ యూనిట్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఇంకా చాలా మంది స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా 1000 కోట్ల విజయంపై ఇప్పటికే ప్రభాస్, కమల్ హాసన్ మాట్లాడుతూ స్పెషల్ వీడియోలు రిలీజ్ చేసారు.

Also Read : Nani – Chiranjeevi : నాని వాయిస్‌తో.. మెగాస్టార్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గొప్పతనం విన్నారా..?

తాజాగా అమితాబ్ బచ్చన్ కల్కి సినిమా విజయంపై మాట్లాడిన వీడియోని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. కల్కి సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకు మీరు చూపిస్తున్న ప్రేమ, మా సినిమాకు మీరిచ్చే విలువ ఈ 1000 కోట్ల కంటే ఎక్కువ. నా కో ఆర్టిస్ట్ లకు, సినిమాకి పనిచేసిన వారందరికి, సినిమాకు సపోర్ట్ చేసిన వారందరికి ధన్యవాదాలు. ప్రభాస్ కి ఇది చాలా మాములు విషయం. రొటీన్ గా ప్రభాస్ సినిమాలు 1000 కోట్లు సాధిస్తుంటాయి. ఇంత గొప్ప కల్కి సినిమాలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే నాలుగు సార్లు ఈ కల్కి సినిమా చూసాను. ప్రతిసారి నాకు కొత్తగానే ఉంది సినిమా అంటూ తెలిపారు.

దీంతో అమితాబ్ వీడియో వైరల్ గా మారగా ప్రభాస్ గురించి పొగడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు