×
Ad

Palak Muchhal : మహేష్ బాబుని మించి.. ఈ సింగర్ చిన్నపిల్లలకు ఫ్రీగా హార్ట్ ఆపరేషన్స్.. ఇప్పటికే 3000 మందికి

మహేష్ లాగే ఓ బాలీవుడ్ సింగర్ కూడా హార్ట్ సమస్యలు ఉన్న చిన్న పిల్లలకు తన డబ్బులతో ఆపరేషన్స్ చేయిస్తుంది.

  • Published On : July 18, 2024 / 06:52 AM IST

Bollywood Singer Palak Muchhal saves Childrens Life with arranged money for their Heart Operations

Palak Muchhal : మన సూపర్ స్టార్ మహేష్ బాబు హార్ట్ సమస్య ఉన్న చిన్నపిల్లలకు ఫ్రీగా తన సొంత డబ్బులతో చికిత్స చేయిస్తాడని తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు దాదాపు 1000 మందికి పైగా పిల్లలకు ఆపరేషన్స్ చేయించి వారి ప్రాణాలను కాపాడాడు. అయితే మహేష్ లాగే ఓ బాలీవుడ్ సింగర్ కూడా హార్ట్ సమస్యలు ఉన్న చిన్న పిల్లలకు తన డబ్బులతో ఆపరేషన్స్ చేయిస్తుంది.

బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ ఎన్నో సినిమాల్లో తన పాటలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా నిర్వహిస్తుంటుంది. అయితే పాలక్ ముచ్చల్ తన యంగ్ ఏజ్ నుంచే ఈ పని చేస్తుంది. తను సంపాదించిన దాంట్లో చాలా భాగం పిల్లల ఆపరేషన్స్ కి ఖర్చుపెడుతుంది. ఇప్పటివరకు పాలక్ ముచ్చల్ ఏకంగా 3000 మంది పిల్లకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించింది. స్వతహాగా తను డాక్టర్ కూడా. పిల్లల్ని కాపాడటానికే పాటలు పాడుతున్నాను అని చెప్తుంది.

Also Read : R Narayana Murthy : హాస్పిటల్లో చేరిన ఆర్ నారాయణమూర్తి.. ఏమైంది?

ఇటీవల 3000వ ఆపరేషన్ చేయించగా హాస్పిటల్ వాళ్ళు పాలక్ ముచ్చల్ ని అభినందించారు. ఈ క్రమంలో పాలక్ ముచ్చల్ మీడియాతో మాట్లాడుతూ.. నా పాటలు హిట్ అయితే నాకు పేరు వస్తుంది. నాకు వచ్చిన పేరు, డబ్బు ఇందుకోసమే వినియోగిస్తాను. నేను ఒక్క మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తే దాంతో వచ్చిన డబ్బుతో దాదాపు 14 మంది ఆపరేషన్స్ కి సరిపోతుంది. ఇంకా నా దగ్గర ఉన్న లిస్ట్ లో 400 మందికి పైగా ఆపరేషన్స్ జరగాలి. వారి కోసం కష్టపడుతున్నాను, నిధులు సమకూర్చేందుకు కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నాను. చిన్నారుల ప్రాణాలు కాపాడటంతో నాకు ఆనందం ఉంది అని తెలిపింది. దీంతో ఈ విషయం వైరల్ అవ్వగా ఆమె అభిమానులు, నెటిజన్లు పాలక్ ముచ్చల్ ని అభినందిస్తున్నారు.