Bro Movie : మూవీలో ‘శ్యాంబాబు’ ఆ ఏపీ మంత్రినా బ్రో.. సోషల్ మీడియాలో వైరల్..!

పవన్ కళ్యాణ్ బ్రో మూవీలో పొలిటికల్ టచ్. మూవీలో 30 ఇయర్స్ పృథ్వీ పోషించిన 'శ్యాంబాబు' పాత్ర..

Political dialogues and scene in Pawan Kalyan Bro movie

Bro Movie : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బ్రో’ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. వింటేజ్ పవన్ స్క్రీన్ పై కనిపించడంతో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. మూవీలో పవన్ ఓల్డ్ మూవీ సాంగ్స్ తో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ ని విపరీతంగా అలరించాయి. కాగా పవన్ గత చిత్రాలు.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లో పొలిటికల్ పరంగా డైలాగ్స్ వినిపించాయి. ఇక ఈ సినిమాలో అలాంటి డైలాగ్స్ ఆస్కారం లేదు.

Bro Movie : తండ్రి మూవీ చూసిన అకీరా.. అదిరిపోయే కారులో.. స్టైలిష్ లుక్స్‌లో హీరోలా ఎంట్రీ.. వీడియో చూశారా..?

అయితే ఈ మూవీ రచయిత త్రివిక్రమ్ అవకాశం కలిపించుకొని.. ఒక రెండు సీన్స్ లో పొలిటికల్ టచ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీలోని ఒక రెండు సన్నివేశాలు చూసిన ఆడియన్స్ ఏపీ రాజకీయాలకి లింక్ చేస్తున్నారు. 30 ఇయర్స్ పృథ్వీ ఈ సినిమాలో ‘శ్యాంబాబు’ అనే పాత్రని పోషించాడు. ఈ శ్యాంబాబు క్యారెక్టర్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అంబటి డాన్స్ చేసిన ఒక వీడియోని, ఈ మూవీలో శ్యాంబాబుగా పృథ్వీ చేసిన డాన్స్ వీడియోని కలిపి ఎడిట్ చేసి ఒకేలా ఉన్నాయి అంటూ.. ఆ శ్యాంబాబు అంబటి రాంబాబునా బ్రో అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఒకసారి ఆ వీడియో మీరుకూడా చూసేయండి.

NTR : RRRలో నాకు నచ్చిన యాక్టర్ ఎన్టీఆర్.. జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి..!

ఈ డాన్స్ వీడియో మాత్రమే కాదు, పవన్ అండ్ పృథ్వీ మధ్య సంభాషణలు కూడా అంబటి రాంబాబుని గుర్తు చేసేలా ఉన్నాయి అంటూ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఇక ఇదే మూవీలో ఒక సన్నివేశంలో పవన్ మాట్లాడుతూ.. “మీరంతా అతిథులు. ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరు గెస్ట్ లు గానే వచ్చారు. అలాంటి మీరు అతిథులు గానే వెళ్ళిపోవాలి. అంతేగాని ఇది మా సొంతం అంటూ దౌర్జన్యాలు, దోపీడీలు చేస్తామంటే ఊరుకునేది లేదు” అని డైలాగ్ చెబుతాడు. దీంతో ఇది కూడా ఏపీ రాజకీయాల కోణంలోనే వేసినట్లు చెబుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు