Rohit Sharma : కోహ్లీపై ప్రశంసలు.. రోహిత్ పై విమర్శలు.. హిట్‌మ్యాన్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన మాజీ ఆటగాడు
గౌతీ ప్రకటనపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 24, 2024 / 06:31 PM IST
Kris Srikkanth Takes A Massive Dig At Rohit Sharma
Rohit Sharma – Kris Srikkanth : భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు ప్రస్తుతం ఎంతో ఆనందంలో ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఇటీవల హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్. ఫిట్‌గా ఉంటే కోహ్లీ, రోహిత్‌లు ఇద్దరూ వన్డే ప్రపంచకప్ 2027లో ఆడతారంటూ గౌతీ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. గౌతీ ప్రకటనపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తం చేశాడు.
కోహ్లీ ఓ ఛాంపియన్ ఆటగాడని అన్నాడు. అతడి ఫిట్నెస్ పరంగా చూసుకున్నా కూడా అతడు ఖచ్చితంగా 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడని అన్నాడు. అయితే.. రోహిత్ మాత్రం ఆడలేడని చెప్పాడు. అప్పటికి రోహిత్ ఫిట్‌గా ఉండడం అనుమానమేనని తెలిపాడు. ఇక దక్షిణాఫ్రికాలో అతడికి పేలవ రికార్డు ఉందన్నాడు. అతడు ఆడకుంటేనే బెటర్ అనే విధంగా మాట్లాడాడు.
“విరాట్ కోహ్లి 2027 ప్రపంచకప్ ఆడతాడు, కానీ రోహిత్ శర్మ మూర్ఛపోతాడు” అని అతను తన యూట్యూబ్ ఛానెల్లో శ్రీకాంత్ అన్నాడు.
కాగా.. శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే.. రోహిత్ శర్మను శ్రీకాంత్ టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఐపీఎల్ సీజన్ సమయంలో రోహిత్ పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడిన సమయంలో హిట్‌మ్యాన్ పేరును నైన్ హిట్ శర్మగా మార్చుకోవాలని శ్రీకాంత్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో రాణించిన రోహిత్ విమర్శకులందరికి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.
అప్పుడు జట్టులో చోటు ఇవ్వలేదు..
టీమ్ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు చీఫ్ సెలక్టర్‌గా శ్రీకాంత్ ఉన్నాడు. అప్పుడు ప్రపంచకప్ జట్టులో రోహిత్ శర్మ అవకాశం ఇవ్వలేదు.
IND vs SL : టీమ్ఇండియాతో టీ20 సిరీస్‌కు ముందే శ్రీలంకకు భారీ షాక్.. ఇక లంకకు కష్టకాలమే..!
