Spiderman on car bonnet : స్పైడర్‌మ్యాన్ వేషధారణలో హస్తిన రోడ్లపై హల్ చల్ చేసిన యువకుడిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. రోడ్లపై బైకులు, కార్లతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేసి జనాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఉల్లంఘనుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇలాంటి తమతో పాటు చుట్టుపక్కల వారికి ముప్పుగా మారుతున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం సాహస కృత్యాలు చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. ఒక్కోసారి ఇతరుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. రీల్స్ , షార్ట్ వీడియోస్ వచ్చాక ఈ పిచ్చి బాగా ఎక్కువైంది.
తాజాగా ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఓ స్పైడర్‌మ్యాన్ ఇలాంటి విన్యాసాలే చేసి అడ్డంగా బుక్కయ్యాడు. స్పైడర్‌మ్యాన్ గెటప్‌లో కారు బానెట్ మీద దర్జాగా కూర్చుని దూసుకుపోతున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదు రావడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. కారు నంబరు ఆధారంగా స్పైడర్‌మ్యాన్ ఆట కట్టించారు. స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్‌లో ఉన్న వ్యక్తిని నజఫ్‌గఢ్‌లో నివాసం ఉంటున్న ఆదిత్య పార్కర్ (20)గా గుర్తించారు. కారు నడిపిన వ్యక్తిని మహావీర్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న గౌరవ్ సింగ్ (19)గా గుర్తించారు.
ప్రమాదకరమైన డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనల కింద కారు యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. దీనికి గరిష్టంగా రూ. 26,000 జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. ఒక్కొసారి జరిమానా, జైలుశిక్ష రెండూ కలిపి విధించే అవకాశం కూడా ఉంది.
Also Read: కేంద్ర బడ్జెట్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్.. సీఎం చంద్రబాబు ఫొటో అదిరింది!
ప్రమాదకర విన్యాసాలు చేసి అడ్డంగా బుక్కైన స్పైడర్‌మ్యాన్‌పై నెటిజనులు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఎస్కేప్ టెస్ట్‌లో స్పైడర్‌మ్యాన్ విఫలమయ్యాడని ఒకరంటే.. స్పైడర్‌మ్యాన్ కాళ్లకు చెప్పులు ధరించడం పెద్ద నేరమని మరొకరు కామెంట్ చేశారు. స్పైడర్‌మ్యాన్‌కు జరిమానా వేసే ఏకైక దేశం ఇండియా మాత్రమే అంటూ ఇంకొరు సెటైర్ వేశారు.
Ab ni udega?pic.twitter.com/bUlnYt9UG1
— Lala (@Lala_The_Don) July 24, 2024