Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే.. ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ స్పెష‌ల్ గిఫ్ట్‌..

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సినిమాల్లో ఇంద్ర మూవీకి ఓ ప్ర‌త్యేకమైన స్థానం ఉంది.

Indra movie re release

Chiranjeevi Birthday : మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సినిమాల్లో ‘ఇంద్ర’ మూవీకి ఓ ప్ర‌త్యేకమైన స్థానం ఉంది. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫ్యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అప్ప‌ట్లో తెలుగు సినిమా రికార్డులు అన్నింటినీ తిర‌గ‌రాసింది. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచి మెగాస్టార్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. చిన్ని కృష్ణ క‌థ‌ను అందించ‌గా వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ మూవీని నిర్మించారు.

సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా ప్రకాశ్‌ రాజ్ కీలక పాత్రను పోషించాడు. మణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. 24 జూలై 2002 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ మూవీ. నేటితో 22 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు 22న ఈ మూవీని రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. దీంతో మెగా అభిమానులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Maruthi Daughter Hiya : డైరెక్టర్ మారుతి కూతురు ‘హియ’ని చూశారా? ఫోటోలు వైరల్..

ప్ర‌స్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ న‌డుస్తుండ‌డంతో మ‌రోసారి ఇంద్ర మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం అని ఫ్యాన్స్ ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో షౌక‌త్ అలీఖాన్.. మొక్కే కదా అని పీకేస్తే పీక‌కోస్తా.. అనే డైలాగ్‌ అభిమానుల‌ను ఉర్రూత‌లు ఊగించింది.

ట్రెండింగ్ వార్తలు