Site icon 10TV Telugu

Raj Tharun Movie : రాజ్ తరుణ్ సినిమా.. మహేష్ శ్రీమంతుడిలా అనిపించొచ్చు కానీ..

Raj Tharun Purushothamudu Movie Director and Producer says about Movie

Raj Tharun Purushothamudu Movie Director and Producer says about Movie

Raj Tharun Movie : రాజ్ తరుణ్, హాసిని శ్రీధర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘పురుషోత్తముడు’. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో పురుషోత్తముడు సినిమా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా.. లాంటి చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. పురుషోత్తముడు సినిమా జులై 26 రిలీజ్ కాబోతుండగా తాజాగా డైరెక్టర్ రామ్ భీమన, నిర్మాత డా.రమేష్ తేజావత్ మీడియాతో మాట్లాడారు.

డైరెక్టర్ రామ్ భీమన మాట్లాడుతూ.. గతంలో నేను ఆకతాయి, హమ్ తుమ్ సినిమాలు తీసాను. హమ్ తుమ్ మంచి హిట్ అయింది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పురుషోత్తముడు సినిమా చేసాను. మంచి ప్రొడ్యూసర్స్ దొరకడంతో మంచి క్వాలిటీతో సినిమా చేసాము. పురుషోత్తముడు సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్టార్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్లంతా మా సినిమాకు మరింత హైప్ తెచ్చారు. ఒక న్యూస్ ఆర్టికల్ చదివి కొన్నేళ్ల క్రితమే ఈ కథ రెడీ చేశాను. ఒక కోటీశ్వరుడైన అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు అక్కడ ఏం చేశాడు అనేది పురుషోత్తముడు కథ. మహేశ్ బాబు శ్రీమంతుడు లాంటి సినిమాలు ఇలాంటి కథలతో వచ్చాయి అని అందరికి అనిపించొచ్చు కానీ అలా కథ లైన్ గా అనుకుంటే ఎన్నో సినిమాలు ఒకేలా అనిపిస్తాయి. ఆ కథలో ఏం చెప్పాం అనేది ముఖ్యం. పురుషోత్తముడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని ఒక పాయింట్ ను చూపించాము. రాజ్ తరుణ్ సినిమాకు పూర్తిగా సహకరించాడు అని తెలిపారు.

Also Read : Sundeep Kishan : ఆ సమస్యతో బాధపడుతున్న సందీప్ కిషన్.. దానివల్ల షూటింగ్ టైంలో ఊపిరి ఆడక..

ఇక నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ.. నేను ఆంధ్రా నుంచి ముంబై వెళ్లి అక్కడ బిజినెస్ చేస్తున్నాను. సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఒక మంచి తెలుగు సినిమా తీయాలనుకున్నాను. నిర్మాతగా ఏదో డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా అన్నిట్లో నేను ఇన్వాల్వ్ అయి పనిచేసాను. పోస్ట్ ప్రొడక్షన్ కోసం 6 నెలలు తీసుకొని మంచి క్వాలిటీతో సినిమాని తీసుకొచ్చాము. రాజ్ తరుణ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. హీరోయిన్ హాసినీ సుధీర్ రాజ్ తరుణ్ కు జోడీగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. పురుషోత్తముడు సినిమా కుటుంబంతో సహా చూసేలా ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కడా వల్గారిటీ, చెడు అలవాట్లు చూపించడం లాంటివి చేయలేదు. మా సంస్థలో తర్వాత కూడా సినిమాలు వస్తాయి. నైజాం, ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఓవర్సీస్ లో పురుషోత్తముడు సినిమా జులై 26న రిలీజ్ అవుతుంది అని తెలిపారు.

Exit mobile version