Sundeep Kishan : ఆ సమస్యతో బాధపడుతున్న సందీప్ కిషన్.. దానివల్ల షూటింగ్ టైంలో ఊపిరి ఆడక..

ధనుష్ రాయన్ సినిమాలో సందీప్ కిషన్ ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపాడు సందీప్ కిషన్.

Sundeep Kishan : ఆ సమస్యతో బాధపడుతున్న సందీప్ కిషన్.. దానివల్ల షూటింగ్ టైంలో ఊపిరి ఆడక..

Sundeep Kishan Effected with these Health Issues said in Interview

Updated On : July 24, 2024 / 3:57 PM IST

Sundeep Kishan : ఇటీవలే ఊరుపేరు భైరవకోన సినిమాతో హిట్ కొట్టిన సందీప్ కిషన్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. జులై 26న రాబోతున్న ధనుష్ రాయన్ సినిమాలో సందీప్ కిషన్ ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపాడు సందీప్ కిషన్.

సందీప్ కిషన్ షూటింగ్ లో జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడుతూ.. ఓ రోజు షూటింగ్ మొత్తం పొగ, డస్ట్ తో ఉన్న సీన్స్ చేయాలి. నాకు అసలే సైనస్, బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. దాని వల్ల అసలు గాలి ఆడలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. మా వాళ్ళు అంబులెన్స్ పిలుద్దాం అన్నారు. నేను అక్కర్లేదు అని చెప్పి బయటకి వెళ్లి ఒక పది నిముషాలు రెస్ట్ తీసుకొని, గాలి పీల్చుకొని మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యాను. కాళిదాసు మాత్రం ఆ పొగ దెబ్బకి పడిపోయాడు అని తెలిపారు.

Also Read : Sundeep Kishan : ఈ హీరో ఎంత మంచి పని చేస్తున్నాడో.. రోజూ అంతమందికి ఉచితంగా భోజనాలు.. త్వరలో సబ్సిడీ క్యాంటిన్లు..

అలాగే రాయన్ సినిమా షూట్ లో యాక్షన్ సీన్స్ ఎక్కువే ఉన్నాయని, ఆ సీన్స్ లో గాయాలు కూడా అయ్యాయని తెలిపాడు సందీప్.