Sundeep Kishan : ఈ హీరో ఎంత మంచి పని చేస్తున్నాడో.. రోజూ అంతమందికి ఉచితంగా భోజనాలు.. త్వరలో సబ్సిడీ క్యాంటిన్లు..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో తాను చేసే మంచి పని గురించి చెప్పాడు.

Hero Sundeep Kishan Doing Good Work from his Restaurants

Sundeep Kishan : మన సెలబ్రిటీలు ఓ పక్క సంపాదించినా మరో పక్క ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తారు. చాలామంది సెలబ్రిటీలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక తమ వంతు సహాయం చేస్తారు. అయితే కొంతమంది చెప్పుకోరు, కొంతమంది ప్రచారం చేసుకుంటారు. తాజాగా హీరో సందీప్ కిషన్ ఇన్నాళ్లుగా చేస్తున్న ఓ మంచిపనిని అనుకోకుండా మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు.

ధనుష్ రాయన్ సినిమాలో సందీప్ కిషన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా జులై 26 రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో తాను చేసే మంచి పని గురించి చెప్పాడు. సందీప్ కిషన్ కి వివాహ భోజనంబు అనే రెస్టారెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం ఏడు బ్రాంచ్ లు ఉన్నాయి. అయితే ప్రతి బ్రాంచ్ రెస్టారెంట్స్ నుంచి డైలీ ఉచితంగా 50 మందికి ఫుడ్ పంపిస్తున్నాడట. అవసరం ఉన్న పేదలకు, ఆశ్రమాలకు సందీప్ డైలీ ఒక్కో రెస్టారెంట్ నుంచి 50 మందికి అంటే అన్ని రెస్టారెంట్స్ నుంచి ఆల్మోస్ట్ 350 మందికి రోజూ ఉచితంగా భోజనం పెడుతున్నాడని తెలిపాడు. ప్రజలకు నేనేమి చేయగలను అని ఆలోచించినప్పుడు ఓ పక్క రెస్టారెంట్స్ పెట్టి ఎంప్లాయిమెంట్ ఇచ్చి మరో పక్క ఇలా ఇవ్వడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాడు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే.. ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ స్పెష‌ల్ గిఫ్ట్‌..

అలాగే సందీప్ కిషన్ అన్న క్యాంటీన్స్ లాగే తక్కువ రేటుకి క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు, దాని గురించి వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. దీంతో సందీప్ కిషన్ చేస్తున్న మంచి పనిని అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు