×
Ad

Varun Chakaravarthy : తన డైరెక్షన్‌లో విజయ్ హీరోగా సినిమా తీస్తాను అంటున్న క్రికెటర్..

తాజాగా ఓ క్రికెటర్ డైరెక్టర్ గా మారి సినిమా తీస్తాను అంటున్నాడు.

  • Published On : July 24, 2024 / 09:04 AM IST

Cricketer Varun Chakaravarthy Wants to Direct a Movie With Tamil Star Hero Vijay

Varun Chakaravarthy – Vijay : ఇండియాలో క్రికెట్, సినిమా.. ఈ రెండిటికి ఉన్న ఆదరణ ఇంక దేనికి ఉండదు. ఇండియా జనాభా అంతా క్రికెట్, సినిమాని ఆరాధిస్తారు. ఇక ఈ రెండు కలిస్తే ఆ ఆనందం ఇంకోలా అంటుంది. మన క్రికెటర్స్ కి, సినిమా వాళ్ళకి వేరే ట్యాలెంట్స్ కూడా ఉంటాయని తెలిసిందే. తాజాగా ఓ క్రికెటర్ డైరెక్టర్ గా మారి సినిమా తీస్తాను అంటున్నాడు.

తమిళనాడుకు చెందిన వరుణ్ చక్రవర్తి తమిళనాడు తరపున, KKR తరపున ఆడాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో వరుణ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. KKR ఐపీఎల్ కప్పు అందుకోవడంలో తన పాత్ర ఎంతో ఉంది. తాజాగా వరుణ్ చక్రవర్తి రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Also Read : NTR Dance : ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి తెగ పొగిడేసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్.. దేవరలో ఎన్టీఆర్ డ్యాన్స్..

వరుణ్ చక్రవర్తి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు చాలా డ్రీమ్స్ ఉండేవి. ప్రస్తుతం నాకు ఒక రెండు, మూడు గోల్స్ ఉన్నాయి. నేనేం చేయాలి అని నాకు క్లారిటీ ఉంది. ఫిలిం మేకింగ్ నా క్రియేటివ్ థాట్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది. నేను కచ్చితంగా ఫిలిం మేకింగ్ వైపు వెళ్తాను. స్టోరీస్, సీన్స్ రాయడం నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ నేను మూడు కథలు రాసాను. బౌండెడ్ స్క్రిప్ట్ తో సహా రెడీగా ఉన్నాయి ఆ కథలు. ఎప్పటికైనా డైరెక్టర్ గా విజయ్ తో సినిమా చేయాలని కోరిక అని తెలిపాడు.

దీంతో ఈ క్రికెటర్ లో ఈ సినిమా ట్యాలెంటు కూడా ఉందా అని ఆశ్చర్యపోతూనే అల్ ది బెస్ట్ చెప్తున్నారు. క్రికెట్ కెరీర్ అయ్యాక వరుణ్ సినిమాల్లోకి రావొచ్చని తెలుస్తుంది. గతంలోనే వరుణ్ చక్రవర్తి విజయ్, రజినీకాంత్.. ఇలా పలువురు తమిళ స్టార్స్ ని కలిసాడు. క్రికెట్, సినిమా రెండూ బాగా ఇష్టమైన వాళ్ళు వరుణ్ ఫ్యూచర్ లో కచ్చితంగా డైరెక్టర్ అవ్వాలని, సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు.