NTR Dance : ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి తెగ పొగిడేసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్.. దేవరలో ఎన్టీఆర్ డ్యాన్స్..

తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి తెగ పొగిడేసాడు.

NTR Dance : ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి తెగ పొగిడేసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్.. దేవరలో ఎన్టీఆర్ డ్యాన్స్..

Bollywood Choreographer Bosco Martis Praised Jr NTR Dance in Devara

Updated On : July 24, 2024 / 8:58 AM IST

NTR Dance : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమా అంటే ఫ్యాన్స్ ముఖ్యంగా డ్యాన్స్ లు ఊహిస్తారు. దేశంలోనే బెస్ట్ డ్యాన్సర్లలో ఎన్టీఆర్ ఒకరని తెలిసిందే. దేవర సినిమాకి ఇటీవల బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ వర్క్ చేసినట్టు తెలిపారు.

కొన్ని రోజుల క్రితం బాస్కో మార్టిస్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటో షేర్ చేసి దేవర సినిమా సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేసానని పోస్ట్ చేసాడు. థాయిలాండ్ లో ఎన్టీఆర్, జాన్వీ మీద ఓ రొమాంటిక్ సాంగ్ బాస్కో మార్టిస్ కంపోజ్ చేసినట్టు సమాచారం. తాజాగా బాస్కో మార్టిస్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి తెగ పొగిడేసాడు.

Also Read : Prabhas : ఆ డైరెక్టర్ కూతురు చాక్‌లెట్ కావాలని అడిగితే.. ఏకంగా ప్లేట్ నిండా చాక్‌లెట్స్ తెచ్చిన ప్రభాస్..

డ్యాన్స్ మాస్టర్ బాస్కో మార్టిస్ మాట్లాడుతూ.. నేను దేవరకు పని చేశాను. నేను చేసింది అంత కష్టమైనా సాంగ్ కాదు కానీ ఒక స్మూత్ సాంగ్ లాంటిది. ఎన్టీఆర్ ఒక అద్భుతమైన డ్యాన్సర్. బెస్ట్ పర్ఫార్మర్స్ లో ఎన్టీఆర్ ఒకరు. అతని డ్యాన్స్ స్టెప్స్ తో అందర్నీ మెప్పిస్తాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అతనితో పని చేయడం నాకొక అద్భుతంగా అనిపించింది అని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరలో డ్యాన్స్ ఏ రేంజ్ లో వేశాడో అని ఎదురుచూస్తున్నారు.