viral news : మా కోడిపెట్టలు గుడ్లు పెట్టట్లేదు సార్..పోలీసులకు వింత ఫిర్యాదు..!!

మా కోళ్లు గుడ్లు పెట్టటం లేదు సార్ ..అంటూ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత ఘటన పూణెలో జరిగింది. అదేంటీ కోళ్లు గుడ్లు పెట్టకపోతే పోలీలేం చేస్తారు? మరీ విడ్డూరం కాకపోతే..అని అనుకోవచ్చు. కానీ అసలు విషయం విన్న పోలీసులకు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

poultry farmer Chickens complain that they are not laying eggs: సార్ మా ఇంట్లో చోరీ జరిగింది సార్..నా బైక్ ఎవరో ఎత్తుకెళ్లిపోయాడు సార్..లేదా మా కారు చోరీ అయ్యిందనో..నా సెల్ ఫోన్ పోయిందనో పోలీసులు ఫిర్యాదు చేస్తుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ వ్యక్తి మాత్రం ‘మాకోడి పెట్టలు గుడ్లు పెట్టటంలేదు సార్..కాస్త ఆ పనేదో చూద్దురూ..అంటూ ఫిర్యాదు చేసిన వింత ఘటన పూణెలో చోటుచేసుకుంది. మా కోళ్లు గుడ్లు పెట్టడం లేదంటూ పౌల్ట్రీ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది.

కోళ్లు గుడ్లు పెట్టకపోతే పోలీసులేం చేస్తారు?మరీ విడ్డూరం కాకపోతే..పిచ్చి కేసలు పిచ్చి పనులు కాకపోతే అని పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది కదూ..కానీ ఈ కేసులో ఓ తిరకాసు ఉందే అని కూడా అనిపిస్తుంది. ఈ వింత ఫిర్యాదు విన్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. తాము విన్నది నిజమా? కాదా? అని డౌటైనుమానం కూడా వచ్చేసింది.

అంతకుముందు వరకు బాగానే గుడ్లు పెట్టిన కోళ్లు ఓ కంపెనీ తయారు చేసిన ఆహారం తిన్న తరువాతి నుంచి గుడ్లు పెట్టడం మానేశాయి. మొదట్లో యజమానులకు విషయం అర్థం కాలేదు. ఎందుకిలా జరుగుతుందా అని నిఘా వేస్తే… సదరు కంపెనీ ఆహారం వేయడం మొదలు పెట్టిన తరువాతే గుడ్ల ఉత్పత్తి తగ్గిందని తేలింది. దీంతో పోలీసులకు ఆ కంపెనీ మీద ఫిర్యాదు చేశారు. అదన్నమాట అసలు విషయం..ఈ కోళ్ల దాణాను సప్లయ్ చేసిన సంస్థ మరో మూడు, నాలుగు ఫౌల్ట్రీ ఫారాలకు కూడా దాణా సప్లయ్ చేసింది. ఆ సంస్థ దగ్గర దాణా కొన్ని ఫౌల్ట్రీ ఫారాల్లో కూడా ఇటువంటి సమస్య వచ్చింది. దీంతో పౌల్ట్రీ యజమానులు లబోదిబోమంటూ పోలీసుల దగ్గరకొచ్చి మొరపెట్టుకున్నాడు.

ఈ వింత కేసుపై లాల్ భోర్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర మోక్షీ మాట్లాడుతూ.. తమ వద్దకు నలుగురు ఫౌల్ట్రీ యజమానులు, తమ కోళ్లు దాణా తిన్న తరువాత నుంచి గుడ్లు పెట్టడం మానేశాయని ఫిర్యాదుతో వచ్చారనీ..దీంతో సదరు కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అహ్మాద్ నగర్ జిల్లాలోని ఒక కంపెనీ నుంచి కోళ్ల దాణాను కొనుగోలు చేశామని, దానిని కోళ్లకు వేసినప్పటినుంచి ఒక్క కోడి కూడా ఒక్కటంటే ఒక్క గుడ్డు కూడా పెట్టడం లేదని ఓ కోళ్ల ఫారం యజమాని వాపోయారు. ఈ వింత ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని పోలీసులు సదరు కంపెనీ ప్రతినిధులను విచారిస్తున్నారు. అలాగే ఈ విషయం మీద పశువైద్య అధికారులను అడిగి మరిని వివరాలు తెలుసుకుంటున్నారు.

పశు వైద్యాధికారులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దీంట్లో భాగంగా సదరు సంస్థ అధికారులను పోలీసులు ప్రశ్నించారు. పౌల్ట్రీ యజమానుల గోల ఇలా ఉంటే వారికి దాణా అమ్మిన సంస్థ మాత్రం వారి ఆరోపణలకు కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమేనని తాము క్వాలిటీ గల దాణానే తయారు చేసి అమ్ముతున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ తమ కోళ్లు గుడ్లు పెట్టకపోవటానికి కారణం ఆ కంపెనీ దాణా వల్లే జరిగిందంటూ పౌల్ట్రీ రైతులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరి ఈ విచిత్ర కేసును పోలీసులు ఎలా పరిష్కారిస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు