Twitter logo X: ట్విటర్ లోగో ‘X’ కి మారగానే రైలు వెనకాల ఉండే ‘X’ పై మొదలైన చర్చ.. ఇంతకీ దాని అర్థం ఏంటో తెలుసా?

రైల్వే శాఖ చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ట్వీట్ కు 1100కి పైగా లైక్‌లు, 100 రీట్వీట్లు వచ్చాయి. రైల్వే మంత్రిత్వ శాఖ X యొక్క అర్థాన్ని వివరించింది.

Twitter logo X – Indian Railway : ట్విట్టర్ తన లోగోను మార్చింది. ఇప్పటి వరకు ఉన్న పక్షిని ఎగరగొట్టి ఇప్పుడు X అనే అక్షరాన్ని లోగోగా పెట్టారు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk). దీంతో ట్విటర్‌ని ఓపెన్ చేస్తే బ్లూ బర్డ్‌కు బదులుగా ఎక్స్‌ గుర్తు కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై నెట్టింట్లో భారీ చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో మరో చర్చకు తెరలేపింది భారతీయ రైల్వే. నైరుతి రైల్వే మంగళవారం భారతీయ రైల్వే రైలు వెనకాల పెద్ద పసుపు రంగు ‘X’ అని రాసి ఉన్న ఫొటోను ట్వీటర్ లో చేసింది. అనంతరం ‘#ఇండియన్‌రైల్వేస్ ‘X’ ఫ్యాక్టర్. కోచ్‌పై ఉన్న ఎక్స్ సింబల్ అంటే ఏంటో తెలుసా?’ అని నెటిజెన్లను ప్రశ్నించారు.


ప్రతి రైలు చివరి కంపార్ట్‌మెంట్‌పై ఎల్లప్పుడూ ‘X’ గుర్తు ఉంటుందనే విషయం తెలుసు. ఇది రైలు పూర్తిగా స్టేషన్‌ను దాటిందని చూపిస్తుంది. దీంతో రైల్వే అధికారులు రైలు వెనకాల మరే కోచ్ లేదని తెలుసుకుంటారు. రైల్వే శాఖ చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ట్వీట్ కు 1100కి పైగా లైక్‌లు, 100 రీట్వీట్లు వచ్చాయి. రైల్వే మంత్రిత్వ శాఖ X యొక్క అర్థాన్ని వివరిస్తూ.. ఈ ఏడాది మార్చిలో, రైల్వే మంత్రిత్వ శాఖ రైలులో పసుపు రంగు ‘X’ చిత్రంతో కూడిన ట్వీట్‌ను పంచుకుంది. ‘X ఫ్యాక్టర్’ అంటే ఏమిటో మీకు తెలుసా అని ప్రజలను అడుగుతూనే దాని వెనకాల విషయాన్ని వెల్లడించింది.


‘మీకు తెలుసా? రైలు చివరి కోచ్‌లోని ‘X’ అంటే రైలు చివరి కోచ్ అదేనని అర్థం. దాని వెనకాల మరే కోచ్ లేదని అర్థాన్ని సూచిస్తుంది. రైలు ఏ కోచును వదలకుండా ఉందని, రైలు స్టేషన్ పూర్తిగా దాటేసిందని సూచిస్తుంది’’ అని రైల్వే శాఖ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజెన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు