Rana : ఇటీవల చాలా మంది సినిమాలపై, సినీ వ్యక్తులపై ఇష్టమొచ్చినట్టు ఫేక్ న్యూస్ లు రాస్తున్నారు. ఇదివరకు వీటిని చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు సినీ సెలబ్రిటీలు. కానీ ఇటీవల ఈ ఫేక్ న్యూస్ లకు కౌంటర్లు వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మనోజ్ పెళ్లి గురించి వార్తలు రాగా మంచుమనోజ్ దానిపై స్పందిస్తూ నా పెళ్ళికి నన్ను కూడా పిలవండి అంటూ సెటైర్ వేశాడు. ఆ తర్వాత రానా కూడా తన సినిమాలకి సంబంధించిన ఫేక్ న్యూస్ కి గట్టిగానే సెటైర్ వేశాడు.
Dulquer Salmaan : కేబీఆర్ పార్క్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సందడి
తాజాగా మరోసారి రానా తన సినిమాపై వచ్చిన ఫేక్ న్యూస్ కి కౌంటర్ ఇచ్చాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవిలు హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా తెలంగాణలో నక్సలిజం నేపథ్యంలో రాబోతుంది. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇటీవల ‘విరాటపర్వం’ సినిమాలో కొన్ని చోట్ల వాడిన భాష కారణంగా ఈ చిత్రం చాలా మందికి కనెక్ట్ అవ్వద్దని, అందుకే నష్టాల బారిన పడకుండా విరాట పర్వం సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని కొన్ని వార్తలు వచ్చాయి.
RC 15 : 7 నిమిషాల కోసం 70 కోట్లు.. రామ్ చరణ్ తో శంకర్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ..
అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే ఇలా వార్తలు రావడంపై రానా స్పందించాడు. ఓ వెబ్ సైట్ రాసిన ఈ న్యూస్ ట్విట్టర్ లో షేర్ చేయగా రానా స్పందిస్తూ.. దయచేసి ఈ భాషా సమస్యలపై నాకు అవగాహన కల్పించండి. ఏం టైం పాస్ గాళ్లు బ్రో మీరు అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు. రానా చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
Pls enlighten me on these language issues ?? …..emi time pass gallu bro Meru !! ?? https://t.co/pqcQKChQY3
— Rana Daggubati (@RanaDaggubati) November 10, 2021