Rana Daggubati says sorry to Sonam Kapoor and Dulquer Salman by Tweet
Rana Daggubati : ఇటీవల దుల్కర్ సల్మాన్(Dulquer Salman) కింగ్ అఫ్ కోత(King of Kotha) సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి రానా(Rana), నాని(Nani) ఇద్దరూ గెస్టులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో రానా మాట్లాడుతూ ఓ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ గురించి విమర్శలు చేశాడు. దుల్కర్ తో ఓ బాలీవుడ్ హీరోయిన్ సినిమా చేసిందని, ఆమె సినిమా చేసేటప్పుడు దుల్కర్ ని చాలా ఇబ్బంది పెట్టిందని, షూటింగ్ మధ్యలో ఫోన్స్ మాట్లాడుకుంటుందని, ఈ విషయంలో నిర్మాతలని తిట్టానని రానా చెప్పాడు.
దీంతో రానా వ్యాఖ్యలు వైరల్ అవ్వగా దుల్కర్ ని అంతలా నిలబెట్టిన ఆ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ ఎవరా అని ఆరా తీశారు. దుల్కర్ చేసిన హిందీ సినిమాల లిస్ట్ తీసి అందులో హీరోయిన్స్ లిస్ట్ చూస్తే రానా చెప్పింది సోనమ్ కపూర్(Sonam Kapoor) గురించి అని తెలియడంతో ఈ వార్త వైరల్ అయింది. బాలీవుడ్ లో కూడా రానా సోనమ్ కపూర్ మీద ఫైర్ అయ్యాడని వార్తలు రాశారు. అయితే ఈ వార్తలు సోనమ్ వరకు వెళ్లినట్టు సమాచారం. దీంతో ఇవాళ ఉదయం రానా సోనమ్ కపూర్ కి, దుల్కర్ కి క్షమాపణలు చెప్తూ, వార్తలని నెగిటివ్ గా పబ్లిష్ చేసారంటూ ఓ ట్వీట్ చేశాడు.
రానా తన ట్వీట్ లో.. నేను మాట్లాడిన మాటలతో సోనమ్ పై బాగా వ్యతిరేకత చూపిస్తున్నారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె కూడా నా స్నేహితురాలే. నేను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశాను. నా మాటలు తప్పుగా అర్ధం చేసుకొని ప్రమోట్ చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను గౌరవంగా భావించే సోనమ్ కపూర్ కి, దుల్కర్ సల్మాన్ కి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియచేస్తున్నాను. ఇప్పటికైనా ఈ ఊహాగానాలకు, వార్తలకు ముగింపు పలకాలని కోరుకుంటున్నాను. అర్ధం చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు అని తెలిపాడు. దీంతో ఈ ట్వీట్ మరింత వైరల్ అయింది. మొన్నేమో అలా సోనమ్ గురించి చెప్పి ఇప్పుడేమో ఇలా సారీ చెప్తూ ట్వీట్ చేయడంతో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
I am genuinely troubled by the negativity that has been aimed at Sonam due to my comments, that are totally untrue and were meant entirely in a light-hearted manner. As friends, we often exchange playful banter, and I deeply regret that my words have been misinterpreted.
I take…— Rana Daggubati (@RanaDaggubati) August 15, 2023