YS Jagan: ఢిల్లీలో జగన్ ధర్నా.. ఏపీ సర్కారుపై మండిపాటు

కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికిపైగా తమ పార్టీ కార్యకర్తలు..

YS Jagan: ఢిల్లీలో జగన్ ధర్నా.. ఏపీ సర్కారుపై మండిపాటు

YS Jagan

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌కు రావాలని వివిధ పార్టీల నేతలను విజయసాయిరెడ్డి ఆహ్వానించారు.

జంతర్‌మంతర్‌ వద్ద జగన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికిపైగా తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు. లోకేశ్ రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లను ఏపీలో పెట్టారని చెప్పారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలతో దాడులు కొనసాగిస్తున్నారని జగన్ అన్నారు. భయంతో జనం వలసలు వెళ్తున్నారని చెప్పారు.

కాగా, జగన్ గత రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ కోరారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతున్న ఘటనలపై ఆయన ఫిర్యాదు చేస్తారు.

Also Read: చంద్రబాబు ఢిల్లీకి నిధుల కోసం వెళ్తారు.. జగన్ మాత్రం..: ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు