వరల్డ్‌లో మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఏదో తెలుసా.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?
వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ లిస్టు 2024ను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసింది.
![వరల్డ్‌లో మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఏదో తెలుసా.. ఇండియా ర్యాంక్ ఎంతంటే? వరల్డ్‌లో మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఏదో తెలుసా.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?](https://10tv.in/wp-content/uploads/2024/07/Indian-passport.jpg)
World Most Powerful Passports 2024 List Released
World Most Powerful Passports 2024: ప్రపంచ దేశాల్లో మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఏదో తెలుసా? హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా 2024 ర్యాంకులను ప్రకటించింది. సింగపూర్ పాస్‌పోర్ట్ మోస్ట్ పవర్ఫుల్ అని హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తెలిపింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 195 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు.
ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ పాస్‌పోర్టులకు సంయుక్తంగా సెకండ్ ర్యాంక్ దక్కింది. వీటితో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాల పాస్పోర్ట్స్ 191 గమ్యస్థానాలకు వీసా-రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి. బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్.. 4వ ర్యాంకులో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 190 దేశాలకు వీసా ఫ్రీ జర్నీ చేయొచ్చు. అమెరికా పాస్‌పోర్ట్ 8వ ర్యాంకులో నిలిచింది. దీంతో 186 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో ఇండియా పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. మన పాస్‌పోర్ట్‌తో ఇండోనేసియా, థాయలాండ్, మలేసియా సహా 58 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. పాకిస్థాన్ పాస్‌పోర్ట్ 100వ ర్యాంకులో నిలిచింది. దీంతో 33 దేశాలకు వీసా రహిత ప్రయాణం సాగించొచ్చు. చివరి స్థానం దక్కించుకున్న అఫ్గానిస్తాన్ పాస్‌పోర్ట్‌తో కేవలం 26 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లగలరు.
అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు.. వీసా ఫ్రీ గమ్యస్థానాలు(బ్రాకెట్లో)
1. సింగపూర్ (195 గమ్యస్థానాలు)
2. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ (192)
3. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191)
4. బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యూకే (190)
5. ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189)
6. గ్రీస్, పోలాండ్ (188)
7. కెనడా, చెకియా, హంగరీ, మాల్టా (187)
8. అమెరికా (186)
9. ఎస్టోనియా, లిథువేనియా, యూఏఈ (185)
10. ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (184)
Also Read: ఈ సంచలన విషయాన్ని 8 నెలల ముందే చెప్పిన వివేక్ రామస్వామి.. చెప్పింది చెప్పినట్లే జరిగింది..