Mokshagna Nandamuri : బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ ఫోటోషూట్ వీడియో వైరల్.. హీరో రెడీ.. సినిమా ఎప్పుడు..?
ఇటీవల కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ స్టైలిష్ ఫోటోలు రెండు బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

Balakrishna Son Nandamuri Mokshagna Photo Shoot Video goes Viral
Mokshagna Nandamuri : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా పలుమార్లు సినిమా ఈవెంట్స్ లో తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని అన్నారు. అయితే గతంలో మోక్షజ్ఞ లుక్స్ మీద హీరో మెటీరియల్ కాదని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ స్టైలిష్ ఫోటోలు రెండు బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
హీరో లాగా అదిరిపోయే లుక్స్ తో మోక్షజ్ఞ అభిమానులతో పాటు అందర్నీ ఇంప్రెస్ చేసాడు. మోక్షజ్ఞ కొత్త ఫొటోలు చూసి మోక్షజ్ఞ ఎంట్రీ రెడీ అయిందని అందుకే ఇలా తయారయి స్పెషల్ ఫోటోషూట్ చేయించాడని అన్నారు. తాజాగా మోక్షజ్ఞ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో షర్ట్ లో మోక్షజ్ఞ అదిరిపోయే లుక్స్ తో ఉన్నాడు. దీంతో మోక్షజ్ఞ ఫోటోషూట్ వైరల్ గా మారడంతో నందమూరి అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.
ఇక మోక్షజ్ఞ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో లాంచ్ అవుతాడని, ఇప్పటికే సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని టాక్ అందిస్తుంది. ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల కోరిక త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీతో తీరబోతుందని అంటున్నారు. మీరు కూడా మోక్షజ్ఞ ఫొటోషూట్ వీడియో చూసేయండి..
#NandamuriMokshagna ??pic.twitter.com/8CHuGHG2Ip
— ??????????? (@UrsVamsiShekar) July 24, 2024