Purushothamudu Event : రాజ్ తరుణ్ సినిమా ఈవెంట్లో.. స్టేజిపై సడెన్‌గా హీరోయిన్‌ని ఎత్తుకున్న డ్యాన్స్ మాస్టర్..

పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజిపై డ్యాన్స్ వేయమని ఈ సినిమాకి పనిచేసిన డ్యాన్స్ మాస్టర్ సుభాష్ ని కోరారు.

Purushothamudu Event : రాజ్ తరుణ్ సినిమా ఈవెంట్లో.. స్టేజిపై సడెన్‌గా హీరోయిన్‌ని ఎత్తుకున్న డ్యాన్స్ మాస్టర్..

Dance Master Subhash Shocking Behaviour with Actress Hassini Sudhir in Purushothamudu Pre Release Event

Updated On : July 24, 2024 / 10:40 AM IST

Purushothamudu Event : సినిమా ఈవెంట్స్ లో స్టేజిపై ఒక్కోసారి జరిగే సంఘటనలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా డ్యాన్స్ మాస్టర్ సుభాష్ హీరోయిన్ ని ఎత్తుకున్న సంఘటన వైరల్ గా మారింది. రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా తెరకెక్కిన పురుషోత్తముడు సినిమా జులై 26 రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇటీవల జరిగిన లావణ్య ఇష్యూ వల్ల ఈ ఈవెంట్ కి రాజ్ తరుణ్ తప్ప సినిమాకి పనిచేసినవాళ్లంతా హాజరయ్యారు.

ఇలాంటి ఈవెంట్స్ లో స్టేజిపై పాటలు పాడమని, డ్యాన్స్ చేయమని అక్కడికి వచ్చిన సెలబ్రిటీలని రిక్వెస్ట్ చేస్తారని తెలిసిందే. ఇదే విధంగా ఈ ఈవెంట్లో స్టేజిపై డ్యాన్స్ వేయమని ఈ సినిమాకి పనిచేసిన డ్యాన్స్ మాస్టర్ సుభాష్ ని కోరారు. హీరో లేకపోవడంతో హీరోయిన్ కూడా వచ్చి డ్యాన్స్ మాస్టర్ తో డ్యాన్స్ వేయమని కోరారు. దీంతో పురుషోత్తముడు సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ మాస్టర్ సుభాష్, హీరోయిన్ హాసిని సుధీర్ స్టేజిపై డ్యాన్స్ వేశారు.

Also Read : Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు.. బాలీవుడ్, అమెరికాలో గట్టి పోటీ.. అదే టైంకి..

అయితే డ్యాన్స్ వేస్తుండగా మధ్యలో సుభాష్ హీరోయిన్ హాసినిని సడెన్ గా ఎత్తుకొని తిప్పాడు. దీంతో హీరోయిన్ తో పాటు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. డ్యాన్స్ చేస్తుండగా హీరోయిన్ కి కూడా ఇలా ఎత్తుకుంటారని తెలీదు, ఎత్తుకొని తిప్పిన తర్వాత హీరోయిన్ హాసిని స్టేజిపైన సరదాగా ఉన్నా ఏంటిది అన్నట్టు, ఆశ్చర్యపోయినట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. సుభాష్ మాస్టర్ చేసిన పనికి అక్కడున్న వాళ్ళు కూడా సడెన్ గా మాస్టర్ ఇలా చేశారేంటి అని షాక్ అయ్యారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. సడెన్ గా డ్యాన్స్ చేస్తూ హీరోయిన్ ని స్టేజిపై ఎత్తుకున్న డ్యాన్స్ మాస్టర్ సుభాష్ పై పలువురు విమర్శలు చేస్తుంటే పలువురు మాత్రం ఈవెంట్లో సరదాగా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

Dance Master Subhash Shocking Behaviour with Actress Hassini Sudhir in Purushothamudu Pre Release Event