Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు.. బాలీవుడ్, అమెరికాలో గట్టి పోటీ.. అదే టైంకి..

గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా రికార్డుల విషయంలో ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారు.

Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు.. బాలీవుడ్, అమెరికాలో గట్టి పోటీ.. అదే టైంకి..

Ram Charan Game Changer will Face Tough Fight in Bollywood and Hollywood

Updated On : July 24, 2024 / 10:01 AM IST

Game Changer : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చరణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గేమ్ ఛేంజర్ సినిమాని క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామని దిల్ రాజు ఇటీవల ఓ ఈవెంట్లో ప్రకటించాడు. దీని బట్టి డిసెంబర్ 20న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా రికార్డుల విషయంలో ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ రికార్డులకు ఢోకా లేకపోయినా బాలీవుడ్ లో, అమెరికాలో కష్టం అంటున్నారు. బాలీవుడ్ లో అదే డేట్ కి అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ సినిమా రాబోతున్నట్టు సమాచారం. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా తారే జమీన్ పర్ సినిమాకి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ రానుంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే వరుణ్ ధావన్, కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమా కూడా క్రిస్మస్ కి రానున్నట్టు తెలుస్తుంది. దీంతో బాలీవుడ్ లో గేమ్ ఛేంజర్ కి గట్టి పోటీ రానుంది.

Also Read : Varun Chakaravarthy : తన డైరెక్షన్‌లో విజయ్ హీరోగా సినిమా తీస్తాను అంటున్న క్రికెటర్..

ఇక మన తెలుగు సినిమాలు ఇటీవల అమెరికాలో కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ సమయానికి హాలీవుడ్ లో ది లయన్ కింగ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘ముఫాసా – ది లయన్ కింగ్’ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కూడా డిసెంబర్ 20 రిలీజ్ అవ్వనుంది. ముఫాసాపై ఇండియాలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ విషయంలో కంగారుపడుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.