Cotton Crop : పత్తి చేలలో కలుపు నివారించే పద్దతి

Cotton Crop : వర్షాధారంగా పండే పంటల్లో... అన్నిటి కంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో..  రైతులు ఈ పంట సాగుకు మక్కువ చూపుతున్నారు. తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40 శాతం విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది.

Cotton Crop : పత్తి చేలలో కలుపు నివారించే పద్దతి

Cotton Crop

Cotton Crop : తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా సాగుచేసే  ప్రధాన వాణిజ్యపంటలలో పత్తి మొదటిస్థానంలో ఉంది. ప్రస్థుతం విత్తిన పత్తి ఆయాప్రాంతాల్లో 10 నుండి 20 రోజుల దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో కులుపు విపరీతంగా పెరిగింది. దీంతో పంట ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారింది. మొదటి దశలోనే కలుపు నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి.

Read Also : Ownership in Cotton Field : ప్రస్తుతం పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్యం.. దిగుబడి సూచనలు

వర్షాధారంగా పండే పంటల్లో… అన్నిటి కంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో..  రైతులు ఈ పంట సాగుకు మక్కువ చూపుతున్నారు. తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40 శాతం విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది. గత 3 సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది.

ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా వుండటం.. రైతులకు అన్నివిధాలుగా పత్తి సాగు అనుకూలంగా వుండటంతో.. ఈ ఏడాది అధికంగా పత్తి సాగవుతుంది. అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 10 నుండి 30 రోజుల దశలో పత్తి పంట ఉంది.

ఇటీవల కురిసిన వర్షాలకు కలుపు అధికంగా పెరిగి, ప్రధాన పంట ఎదుగుదలకు అవరోదంగా మారుతోంది.  అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. ఏ పైరుకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్దితులలో వాడకూడదు.

అలా వాడితే కలుపు నిర్ములన సరిగ్గా జరగక పోగా, కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తొలిదశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. ఖరీఫ్ పత్తిలో కలుపు అధికంగా ఇబ్బంది పెడుతుంది. అయితే శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో కలుపు యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు వీలుంటుంది.

Read Also : Weed Control Cotton : తెలంగాణలో పత్తి సాగు.. ప్రస్తుతం చేపట్టాల్సిన కలుపు యాజమాన్యం