Weed Control Cotton : తెలంగాణలో పత్తి సాగు.. ప్రస్తుతం చేపట్టాల్సిన కలుపు యాజమాన్యం 

Weed Control Cotton : తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 44 లక్షలు.  వర్షాధారంగా పండే పంటల్లో...అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు.

Weed Control Cotton : తెలంగాణలో పత్తి సాగు.. ప్రస్తుతం చేపట్టాల్సిన కలుపు యాజమాన్యం 

Methods of Weed Control in Cotton

Weed Control Cotton : తెలుగు రాష్ట్రాల్లో  విత్తే ప్రధాన వాణిజ్యపంటలలో పత్తి అగ్రస్థానంలో వుంది. వర్షాధారంగా సాగుచేసే పంటలలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్థుతం విత్తిన పత్తి 15- 30 రోజుల దశలో ఉంది. అయితే  పత్తిఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే సకాలంలో కలుపు నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుదని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత.

Read Also : Kharif Crops : ఖరీఫ్ పంటల సాగులో పాటించాల్సిన యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 44 లక్షలు.  వర్షాధారంగా పండే పంటల్లో…అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు. దీంతో తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40 శాతం విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది.

గత 3 సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తుండటం, మద్దతు ధర ఆశాజనకంగా వుండటం వల్ల రైతులకు అన్నివిధాలుగా పత్తి సాగు అనుకూలంగా వుండటంతో ఈ ఏడాది ఏకంగా 52 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేశారు.

అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో 15 – 35 రోజుల దశలో పత్తి పంట ఉంది. ఈ దశలోనే కలుపు ప్రధాన పంట ఎదుగుదలకు అవరోదంగా మారుతోంది.  అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.

సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్దితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్ములకన సరిగ్గా జరగక పోగా, కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తొలిదశలో పత్తిలో ఆశించే కలుపునివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత.

ఖరీఫ్ పత్తిలో కలుపు అధికంగా ఇబ్బంది పెడుతుంది. వరుసల మధ్య దూరం అధికంగా ఉండటం కలుపు పెరుగతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో కలుపు యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు వీలుంటుంది.

Read Also : Ownership in Cotton Field : ప్రస్తుతం పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్యం.. దిగుబడి సూచనలు