Kharif Crops : ఖరీఫ్ పంటల సాగులో పాటించాల్సిన యాజమాన్యం

Kharif Crops : ఖరీఫ్ పంటల సాగులో పాటించాల్సిన యాజమాన్యం

Kharif Crops : ఖరీఫ్ పంటల సాగులో పాటించాల్సిన యాజమాన్యం

Cultivation of Kharif Crops

Kharif Crops : ఖరీఫ్ ప్రారంభమైంది. అడపా దడప పడుతున్న వర్షాలకు ఇప్పటికే రైతులు భూములు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకున్నారు. అయితే మెట్ట, మాగాణుల్లో పంటలు సాగుచేసేటప్పుడు.. రైతులు ఎలాంటి పంటలను ఎంచుకోవాలి.. సాగులో ఎలాంటి మెళకువలు తీసుకుంటే పెట్టుబడులు తగ్గి..  అధిక దిగుబడులు సాధించవచ్చో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డా. ఉమారెడ్డి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

మధ్య తెలంగాణ జోన్ లోకి  ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలు వస్తాయి. ఇక్కడ  ఖరీఫ్ లో ప్రధాన పంటలు వరి, పత్తి, అపరాలు, జొన్న, చెరకు , మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలను సాగుచేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఇప్పటికే లో దుక్కులు చేసుకొని, విత్తనాలు సేకరించుకున్నారు.

విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. బోర్లకింద వరిసాగు చేసేవారు రోహిణీకార్తెలో వరినార్లు పోయటం పరిపాటి. సీజను ఆసన్నమవుతున్న ప్రస్తుత సమయంలో వానాకాలం పంటలకు రైతులు ఎలా సన్నద్ధం కావాలి. ఎలాంటి పంటలను వేసుకోవాలి , వరి నాట్లు ఎప్పటిలోగా పూర్తి అవగాహనతో ఉండాలి. అంతే కాదు పంట కాలం.. పెట్టుబడి.. రాబడి, మార్కెట్ సదుపాయలను కూడా చూసుకోవాలి. ఈ విషయాలన్ని పరిగణలోనికి తీసుకొని ఏ పంట సాగుచేస్తే అధిక నికర ఆదాయం పొందగలమో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డా. ఉమారెడ్డి.

అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. రాష్ట్రంలో పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు దుక్కులను దున్నకుని సిద్ధంగా ఉన్నారు. అయితే సరిపడినంత వర్షం కురిసిన తరువాతే విత్తనం వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు పత్తిని సాగుచేసే రైతులు అంతర పంటలను సాగుచేయాలని.. ప్రత్యామ్నాయంగా కందిని సాగుచేస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చని సూచిస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు