Ownership in Cotton Field : ప్రస్తుతం పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్యం.. దిగుబడి సూచనలు

Ownership in Cotton Field : పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి , ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది.

Ownership in Cotton Field : ప్రస్తుతం పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్యం.. దిగుబడి సూచనలు

Ownership in Cotton Field

Ownership in Cotton Field : తెలుగు రాష్ట్రాల్లోని మెట్టప్రాంతాల్లో… వర్షాధారంగా పత్తి సాగవుతోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరించినా.. తరువాత మొహం చాటేశాయి. దీంతో సాగు ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఆగష్టు వరకు పత్తి విత్తుకునే వీలుంది. ప్రస్థుతం కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలతోపాటు, బెట్ట పరిస్థితలు ఉన్నాయి. వీటి నుండి గట్టెక్కేందుకు పత్తిసాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త చిట్టిబాబు

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి , ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌తర్వాత తెలుగు  రాష్ట్రాలు ప్రత్తి సాగు విస్తీర్ణం , ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్నాయి . అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ముందుగా పలకరించినా.. సరిపడ వర్షాలు కురవకపోవడంతో రైతులు కొంత  ఆందోళన చెందినా ప్రస్తుతం పత్తిని విత్తిని విత్తుతున్నారు.

ముందుగా విత్తిన చోట10 నుండి – 25 రోజుల దశలో ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య పత్తి సాగు కొనసాగుతోంది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని చోట్ల బెట్ట పరిస్థితులు ఉన్నాయి. బెట్ట పరిస్థితులకు గురైనప్పుడు పంట రంగును కోల్పోయి ఎండిపోయినట్లుగా ఏర్పడుతుంది. ఈ లక్షణాలను  రైతులు గుర్తించినట్లైతే  వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు  శాస్త్రవేత్త డా. జి. చిట్టిబాబు.

ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. పంట పొలాల్లో నీరు నిలిచినట్లైతే, పంట ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉంది . ఈ సమయంలోనే పండాకు తెగులు ఆశించి పూత, కాయ రాలిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇది గమనించిన రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.

అధిక వర్షాలు కురిసినప్పుడు పత్తి మొక్కలు స్థూల పోషకాలను తీసుకోలేవు. మొక్కల్లో సూక్ష్మపోషకాల లోపాలకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జింక్, బోరాన్, ఇనుము లోపాలు ఏర్పడుతాయి. వాటిని నివారణ చర్యలు చేపడితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయి .

అధిక వర్షాలు కురిసినప్పుడు పత్తికి వేరుకుళ్లు, ఎండు కుళ్లు సోకే ప్రమాదం ఉంది. ఇవి సోకితే వేర్లు నల్లగా మారి  పంట ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇది గమనించిన రైతులు యూరియా, పొటాష్ తో పాటు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కూడా పైపాటుగా పిచికారి చేసుకోవాలి. లేదా మొక్క మొదలు వద్ద వేసుకున్న వీటిని నివారించుకోవచ్చు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు