K-Ramp OTT: ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ ‘కె-ర్యాంప్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కె-ర్యాంప్(K-Ramp OTT). యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీని కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించాడు.

K-Ramp OTT: ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ ‘కె-ర్యాంప్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే?

Aha announces the OTT release date of Kiran Abbavaram K-Ramp movie

Updated On : November 8, 2025 / 7:41 PM IST

K-Ramp OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కె-ర్యాంప్. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీని కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించాడు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ(K-Ramp OTT) ఈ సినిమాను నిర్మించాడు. దివాళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్లకు పైగా గగ్రాస్ కలెక్షన్స్ సాధించి దివాళి సాలిడ్ విన్నర్ గా నిలిచింది.

Suma Kanakala: మేము విడిపోవాలని కోరుకున్నారు.. దానికి కారణం రాజీవ్.. ఇన్నాళ్లు బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను..

ఇక “క” సినిమా తరువాత మళ్ళీ అదే రేంజ్ హిట్ సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సెట్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇదిలా ఉంటే, కె-ర్యాంప్ సినిమా ఓటీటీ విడుదల గురించి ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే, తాజాగా కె-ర్యాంప్ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది ఆహా సంస్థ. నవంబర్ 15 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమాకు అదే రేంజ్ లో ఓటీటీలో స్పందన రానుంది.