Suma Kanakala: మేము విడిపోవాలని కోరుకున్నారు.. దానికి కారణం రాజీవ్.. ఇన్నాళ్లు బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను..
యాంకర్ సుమ.. ఈ పేరు వింటే ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. స్టేజిపై ఈమె ఉన్నారు అంటే(Suma Kanakala) ఆ ప్రోగ్రాం ఎన్ని గంటలైనా సరే ఎలాంటి బోర్ లేకుండా అలా సాగుతూ వెళ్తూనే ఉంటుంది.
Anchor Suma Kanakala reacts for the first time to the news of her divorce from Rajeev kanakala
Suma Kanakala: యాంకర్ సుమ.. ఈ పేరు వింటే ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. స్టేజిపై ఈమె ఉన్నారు (Suma Kanakala)అంటే ఆ ప్రోగ్రాం ఎన్ని గంటలైనా సరే ఎలాంటి బోర్ లేకుండా అలా సాగుతూ వెళ్తూనే ఉంటుంది. అంతలా తన మాటలతో మ్యాజిక్ చేస్తుంది. ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్, సెలబ్రెటీ ఇంటర్వ్యూ ఎలా ప్రోగ్రాం ఏదైనా తన మాట్లాగారడీతో మాయ చేస్తుంది సుమ. అందుకే, ఇన్నేళ్లయినా ఆమె స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది.
Janhvi Kapoor: పరువపు వల విసురుతున్న ‘పెద్ది’ బ్యూటీ.. ఫోటోలు
మధ్యలో చాలా మంది వచ్చారు వెళ్లారు కానీ, ఆమె మాత్రం ఆలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. అయితే.. ఈవెంట్స్, ఫ్యామిలీ తప్పా బయట ఎక్కువగా కనిపించరు సుమ. ఆమె అందరినీ ఇంటర్వ్యూ చేయడమే కానీ, ఆమె ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వరు. ఇచ్చినా కూడా చాలా తక్కువ. అలాంటి సుమ చాలా కాలం తరువాత ఒక ఇంటర్వ్యూలో గెస్ట్ గా పాల్గొన్నారు. రీసెంట్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్, ప్రొఫెషనల్, ఫ్యామిలీ, పిల్లలు ఇలా చాలా విషయాల గురించి చెప్పుకొచ్చారు. అలాగే తన భర్త రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్టు వచ్చిన వార్తల గురించి కూడా స్పందించారు.
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ..”నాకు వచ్చిన కలలు చాలా వరకు నిజం అయ్యాయి. రాజీవ్ కు యాక్సిడెంట్ అయినట్టు వచ్చిన కల కూడా నిజం అయ్యింది. అదే సమయంలో కాల్ చేస్తే నిజంగానే యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అలాగే పెళ్లి బంధంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాం. మా పెళ్ళై పాతికేళ్ళు అయ్యింది. ప్రతీ ఒక్కరి జీవితంలో గొడవలు కామన్. వాటివల్ల మేము విడిపోయినట్టు వార్తలు, రూమర్లు వచ్చాయి. నిజానికి మేము విడిపోవాలని కూడాకొంతమంది కోరుకున్నారు. కానీ మేం కలిసే ఉంటాం. మేం కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూనే ఉంటాం. అయినా కూడా రూమర్లు మాత్రం ఆగడం లేదు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. ఇంతకాలం ఫ్యామిలీ, పిల్లలు, కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. నన్ను అంతా ఎనర్జీగా ఉంటావ్ అంటారు దానికి కారణం రాజీవ్, ఆయన ఇచ్చిన సపోర్ట్”అంటూ చెప్పుకొచ్చింది సుమ. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
