Aha announces the OTT release date of Kiran Abbavaram K-Ramp movie
K-Ramp OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కె-ర్యాంప్. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీని కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించాడు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ(K-Ramp OTT) ఈ సినిమాను నిర్మించాడు. దివాళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్లకు పైగా గగ్రాస్ కలెక్షన్స్ సాధించి దివాళి సాలిడ్ విన్నర్ గా నిలిచింది.
ఇక “క” సినిమా తరువాత మళ్ళీ అదే రేంజ్ హిట్ సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సెట్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇదిలా ఉంటే, కె-ర్యాంప్ సినిమా ఓటీటీ విడుదల గురించి ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే, తాజాగా కె-ర్యాంప్ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది ఆహా సంస్థ. నవంబర్ 15 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమాకు అదే రేంజ్ లో ఓటీటీలో స్పందన రానుంది.
Get ready for the Burra Padu entertainer of the year
K Ramp premieres Nov 15 only on aha#KRampOnaha #BurrapaaduEntertainer @Kiran_Abbavaram @HasyaMovies @RajeshDanda_ @JainsNani pic.twitter.com/MAsZKzi4sV
— ahavideoin (@ahavideoIN) November 8, 2025