పిన్నీసును లగ్జరీ వస్తువుగా మార్చేసిన కంపెనీ.. ఎవరైనా రూ.69,000 పెట్టి కొంటారా? ఇలా ఉంటే కొనక ఏం చేస్తారు?

ఒక్క రూపాయి కంటే తక్కువ ధరకు దొరికే పిన్నీసును ఇలా లగ్జరీ వస్తువుగా తీర్చిదిద్దడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు జోకులు, సెటైర్లు వేస్తున్నారు.

పిన్నీసును లగ్జరీ వస్తువుగా మార్చేసిన కంపెనీ.. ఎవరైనా రూ.69,000 పెట్టి కొంటారా? ఇలా ఉంటే కొనక ఏం చేస్తారు?

safety pin

Updated On : November 8, 2025 / 9:08 PM IST

Safety Pin: మన దేశంలోని ప్రతి ఇంట్లో పిన్నీసులు ఉండడం సాధారణమే. మహిళలు పిన్నీసును బాగా వాడుతుంటారు. చాలా తక్కువ ధరకు లభించే పిన్నీసు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌ ప్రాడా ఈ అత్యంత చవకైన వస్తువుని హై ఫ్యాషన్‌ స్థాయికి తీసుకెళ్లింది. ఈ కొత్త “సేఫ్టీ పిన్‌ బ్రోచ్‌”ను కాస్త పెద్ద సైజులో తయారు చేసింది. (Safety Pin)

ఈ పిన్‌ను రంగురంగుల నూలుతో చుట్టి, అందంగా తీర్చిదిద్దింది. ఈ పిన్నీసు ధర అక్షరాలా $775.. అంటే దాదాపు రూ.69,000. అదే ధరకు హై-ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనొచ్చు లేదా మాల్దీవ్స్‌ ట్రిప్‌కు వెళ్లొచ్చు.

Also Read: కుప్పంలో 7 సంస్థలు రూ.2,203 కోట్ల పెట్టుబడులు.. తమ జీవితాలు మారిపోతున్నాయని చంద్రబాబుకు చెప్పిన కుప్పం ప్రజలు

ఒక్క రూపాయి కంటే తక్కువ ధరకు దొరికే పిన్నీసును ఇలా లగ్జరీ వస్తువుగా తీర్చిదిద్దడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు జోకులు, సెటైర్లు వేస్తున్నారు. కొందరు దీన్ని “పీక్‌ క్యాపిటలిజం” అంటుండగా, ఇంకొందరు “బ్రాండింగ్‌లో మాస్టర్‌క్లాస్‌” అంటున్నారు.

ప్రాడా సంస్థ స్టైల్‌ సాధారణంగా ఇలాగే ఉంటుంది. సాధారణ వస్తువును లగ్జరీ వస్తువుగా మార్చడంలో ఆ బ్రాండ్‌కు పేరుంది. పేపర్‌క్లిప్‌ ఈయర్‌ రింగ్స్‌ నుంచి హ్యాండ్‌బ్యాగ్‌ల వరకు ప్రాడా ఇటువంటి ప్రయోగాలు ఎన్నో చేసింది. లగ్జరీ అంటే ఏంటో మనకు కొత్త అర్థం చెబుతుంది.

భారతదేశంలో సేఫ్టీ పిన్‌ను మహిళలు లెహెంగా, దుపట్టా, బ్లౌజ్‌ ఫిక్స్‌ కోసం వాడుతుంటారు. మహిళలు ఎక్కడికి వెళ్లినా హ్యాండ్‌బ్యాగ్‌లో, వాలెట్‌లో తీసుకెళ్తారు. అది ఫ్యాషన్‌ కోసం కాదు, అవసరమైతే దాన్ని వెంటనే వాడొచ్చన్న ప్లాన్‌తో. స్థానిక స్టేషనరీ దుకాణంలో 50 సేఫ్టీ పిన్ల ప్యాక్‌ రూ.20కే దొరుకుతుంది.