Satya: హీరోగా కమెడియన్ సత్య.. హీరోయిన్ గా మిస్ యూనివర్స్ ఇండియా.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మూవీ సెట్

కమెడియన్ సత్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో (Satya)ఆయన లేకుండా సినిమా ఉండటం లేదు. ఈ ఒక్క మాట చాలు ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ చెప్పడానికి.

Satya: హీరోగా కమెడియన్ సత్య.. హీరోయిన్ గా మిస్ యూనివర్స్ ఇండియా.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మూవీ సెట్

Director Ritesh Rana starts a new film with comedian Satya as the hero

Updated On : November 8, 2025 / 8:42 PM IST

Satya: కమెడియన్ సత్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో (Satya)ఆయన లేకుండా సినిమా ఉండటం లేదు. ఈ ఒక్క మాట చాలు ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ చెప్పడానికి. కనీసం సినిమాలో సత్య అలా కనిపిస్తే చాలు అని చిన్న స్పెషల్ రోల్స్ సైతం ఆయన గురించి క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. తన డిఫెరెంట్ యాక్టింగ్ తో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఆడియన్స్ ను ఒక రేంజ్ లో నవ్విస్తున్నాడు ఈ కమెడియన్. అయితే, ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. అవును ఈ క్రేజీ ప్రాజెక్టు నవంబర్ 8న లాంఛనంగా స్టార్ట్ అయ్యింది.

Rukmini Vasanth: కాటుకళ్ళతో కవ్విస్తున్న రుక్మిణి వసంత్.. ఫోటోలు

మత్తు వదలరా, మత్తు వదలరా 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రితేష్ రానా ఈ సినిమా తెరకెక్కించనున్నాడు. మిస్ యూనివర్స్‌ ఇండియా రియా సింఘా ఈ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.