Vivo Y31 5G Phone : పండగ చేస్కోండి.. ఈ ధరకు 5G ఫోన్ దొరుకుతుందా? వివో Y31 ఫీచర్స్ చూస్తే నమ్మలేరు!
Vivo Y31 5G Phone : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో Y31 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. 23 శాతం తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo Y31 5G : వివో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వివో ఇటీవలే వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ కాగా చౌకైన ధరకే లభిస్తోంది. ఈ వివో ఫోన్ 23శాతం తగ్గింపుతో కొనేసుకోవచ్చు. అంతేకాదు.. 50MP ప్రైమరీ కెమెరా సెటప్‌తో వస్తుంది.

6500mAh బ్యాటరీ ప్యాక్, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. పవర్‌ఫుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ కలిగి ఉంది. భారీ 6.68-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే కూడా ఉంది. వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరతో ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌కార్ట్‌లో వివో Y31 5జీ ఫోన్ ధర తగ్గింపు : భారత మార్కెట్లో రూ. 21,499 ధరకు లాంచ్ అయిన వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ 23శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 16,499కే కొనుగోలు చేయవచ్చు. యాక్సెస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్‌లు అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ కోసం ఏదైనా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 15,840 వరకు తగ్గింపు పొందవచ్చు.

డిస్‌ప్లే, డిజైన్ : వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. 1000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందుకుంటుంది. నేరుగా సూర్యకాంతిలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా ఉపయోగించవచ్చు. వివో ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లను కూడా పొందుతుంది. ఈ ఫోన్‌లో పంక్చర్ డ్రాప్ నిరోధకతకు గార్డియన్ గ్లాస్ కూడా ఉంది. వివో ఫోన్ డైమండ్ గ్రీన్, రోజ్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

కెమెరా సెటప్ : వివో Y31 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్.. డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 50MP మెయిన్ సెన్సార్ 0.08MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 8MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. ఈ వివో ఫోన్ నీటి అడుగున కూడా అద్భుతమైన ఫొటోగ్రఫీకి సపోర్టు ఇస్తుంది.

బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ : వివో Y31 5G స్మార్ట్‌ఫోన్‌లో భారీ 6500mAh బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగంలో 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 44W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ చేయవచ్చు. 38 నిమిషాల్లో 0 శాతం నుంచి 50శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
