Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మరణం ఒక మిస్టరీ.. ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు- బండి సంజయ్ సంచలనం

గోపీనాథ్ భార్యకు, కొడుకు తారక్ కు న్యాయం చేయండి. 6 గ్యారెంటీలకు తూట్లు పొడిచారు.

Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మరణం ఒక మిస్టరీ.. ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు- బండి సంజయ్ సంచలనం

Updated On : November 8, 2025 / 11:11 PM IST

Bandi Sanjay: మాగంటి గోపీనాథ్ మరణంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీ అన్నారు. గోపీనాథ్ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని కూడా చూడనివ్వకుండా వేధించారని ఆరోపించారు. గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు రెండు ఆధార్ కార్డులు ఉన్నాయని ఆరోపించిన బండి సంజయ్.. గోపీనాథ్ మరణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని సీఎం రేవంత్ చెప్పడం సిగ్గుచేటు అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. నెల రోజుల క్రితమే గోపీనాథ్ కొడుకు తారక్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో చేశారని, సీఎం రేవంత్ రెడ్డికి తాను ఫిర్యాదు కాపీని పంపిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ కు పౌరుషం ఉంటే మాగంటి గోపీనాథ్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు

”మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీ. గోపీనాథ్ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని కూడా చూడనీయకుండా వేధించారు. గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు రెండు ఆధార్ కార్డులున్నాయి. ఇవిగో రెండు ఆధార్ కార్డులు. గోపీనాథ్ మరణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పడం సిగ్గు చేటు. నెల రోజుల క్రితమే గోపీనాథ్ కొడుకు తారక్ సైబరాబాద్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఇదిగో కంప్లయింట్ కాపీ… పంపిస్తున్నా. సీఎం.. మీకు రోషముంటే, పౌరుషముంటే గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి.

గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారు. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్, కేటీఆర్ కన్ను పడింది. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారు. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నారు. గోపీనాథ్ భార్యకు, కొడుకు తారక్ కు న్యాయం చేయండి. 6 గ్యారెంటీలకు తూట్లు పొడిచారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి బస్ ఛార్జీలు పెంచేశారు” అని నిప్పులు చెరిగారు బండి సంజయ్.