Telangana Govt : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతేకాక విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
CM Revanth Reddy
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌తోపాటు పాలు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు.. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు దృష్టిసారించారు. అంతేకా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
Also Read : School Fees : తెలంగాణలో 11వేల ప్రైవేట్ స్కూళ్లు.. ఏ స్కూల్లో ఎంత ఫీజు? మూడేళ్ల లెక్కల ఆధారంగా డిసైడ్ ..
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-12 తరగతుల విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విజయ డెయిరీ నుంచి పాల సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 29లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. జాతీయ పోషకాహార సంస్థ నిబంధనల మేరకు 1 నుంచి 12 క్లాస్‌ల వరకు చదివే విద్యార్థులకు అల్పాహార సమయంలో గ్లాసు పాలు ఇస్తారు. ఈ లెక్కన రోజుకు సుమారు 3 నుంచి నాలుగు లక్షల లీటర్ల పాలు అవసరమవుతాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు పాఠశాలల విద్యార్థులకు పాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డెయిరీ అధికారులు పేర్కొంటున్నారు. రైతుల నుంచి రోజువారీగా సేకరించే 4లక్షల లీటర్ల పాలు పాఠశాలలు, అంగన్ వాడీ విద్యార్థుల అవసరాలు తీర్చడంతోపాటు సంస్థ పరంగా పాడి ఆధారిత ఉత్పత్తులకు సరిపోతాయని పేర్కొంటున్నారు. సర్కార్ నిర్ణయం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమలైతే.. పాడి పరిశ్రమ అభివృద్ధికి, రైతులకూ లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి.
