Operation Epic Fury: పక్కా స్కెచ్‌తో ఖమేనీ ఖతం.. ట్రంప్ కనుసన్నల్లో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ
ఈ ఆపరేషన్ టైమ్ లో ట్రంప్.. ఇజ్రాయల్ సహా గల్ఫ్ దేశాల నేతలతోనూ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మినిట్ టు మినిట్ అప్ డేట్స్ షేర్ చేసుకున్నట్లు సమాచారం.
Representative Image (Image Credit To Original Source)
- ఓవైపు అమెరికా మాస్టర్ ప్లాన్, మరోవైపు ఇజ్రాయెల్ స్కెచ్
- ట్రంప్ డైరెక్షన్ లోనే ఖమేనీ ఖతం చేసిన అమెరికా సైన్యం
- ఇరాన్ పై అటాక్స్ ను స్వయంగా వీక్షించిన ట్రంప్
- వార్ రూమ్ లో ట్రంప్ తో పాటు ఆపరేషన్ ను వీక్షించిన రూబియో, జేడీ వాన్స్
Operation Epic Fury: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని పక్కా ప్లాన్ తో మట్టుబెట్టాయి అమెరికా-ఇజ్రాయెల్. అయితే, అమెరికా చేపట్టిన ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ ను ట్రంప్ స్వయంగా పర్యవేక్షించారు. అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియోలోని కొన్ని ఫోటోలను వైట్ హౌస్ రిలీజ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లోనే ఈ తంతు అంతా జరిగింది. ఓవైపు అమెరికా మాస్టర్ ప్లాన్, మరోవైపు ఇజ్రాయెల్ స్కెచ్ తో పక్కా ప్లాన్ వేసి మరీ ఖమేనీ ఖతం చేశాయి ఇజ్రాయల్-అమెరికా దేశాలు. ఈ ఆపరేషన్ కు అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా పేరు పెడితే.. ఇరాన్ ఆపరేషన్ రోర్ ఆఫ్ ద లయన్ గా పేరు పెట్టింది.
ఇరాన్ పై దాడులను ట్రంప్ స్వయంగా వీక్షించారు. ఆయనతో పాటుగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆర్మీ కీలక జనరల్స్ సుసి విల్లీస్, డాన్ కెయిన్ తదితరులు అక్కడే ఉన్నారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా వార్ రూమ్ లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా వైట్ హౌస్ రిలీజ్ చేసిన ఫోటోస్ లో తెలుస్తోంది. ఈ ఆపరేషన్ టైమ్ లో ట్రంప్.. ఇజ్రాయల్ సహా గల్ఫ్ దేశాల నేతలతోనూ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మినిట్ టు మినిట్ అప్ డేట్స్ షేర్ చేసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ సాహసోపేతమైన చర్యలు తీసుకోవాలని తమను ఆదేశించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది.
అదే సమయంలో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే ఏం చేయాలో అని కూడా అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి తలెత్తే ముప్పు నుంచి అమెరికా ప్రజలను కాపాడటమే మన లక్ష్యంగా పని చేయాలని సైన్యాన్ని ట్రంప్ ఆదేశించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ట్రంప్ ఆదేశాలతోనే సెట్ కామ్ దళాలు ఇరాన్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని పేర్కొంది. ఇలా మినిట్ టు మినిట్ ఖమేనీ ఖతం ఆపరేషన్ ను వీక్షించారు ట్రంప్.
Also Read: యుద్ధం ఎఫెక్ట్.. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లతోపాటు.. వాటి ధరలు భారీగా పెరగనున్నాయా..?
