INDW vs AUSW : జార్జియా వాల్ సెంచరీ మిస్.. భారత్ ముందు భారీ లక్ష్యం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో (INDW vs AUSW) భారత మహిళల ముందు భారీ లక్ష్యం నిలిచింది.
INDW vs AUSW 2nd T20 India Women target is 164
INDW vs AUSW : మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దీంతో భారత మహిళల ముందు 164 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
Innings Break!
A spirited comeback with the ball by #TeamIndia 👌👌
Over to the batters to chase down 1⃣6⃣4⃣ 🙌
Scorecard ▶️ https://t.co/8prXc1p5fJ#AUSvIND pic.twitter.com/6OpfWW5AMY
— BCCI Women (@BCCIWomen) February 19, 2026
T20 World Cup 2028 : టీ20 ప్రపంచప్ 2028కి నేరుగా అర్హత సాధించిన జట్లు ఇవే.. ప్రకటించిన ఐసీసీ
ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వాల్ (88; 57 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మిగిలిన వారిలో బెత్ మూనీ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. ఫోబ్ లిచ్ఫీల్డ్ (6), ఎల్లీస్ పెర్రీ (7) లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి రెండు వికెట్లు తీసింది. రేణుకా సింగ్ ఠాకూర్ ఓ వికెట్ సాధించింది.
