Ntr: రికార్డ్స్ అలర్ట్.. డ్రాగన్ టీజర్ వచ్చేస్తోంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ
ఎన్టీఆర్(Ntr) డ్రాగన్ సినిమా టీజర్ అప్డేట్.
Ntr Dragon movie teaser update
Ntr: ఇంటర్నేషనల్ లెవల్లో ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న అప్డేట్ వచ్చిన చాలు అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఎలాంటి న్యూస్ కూడా బయటకు రానివ్వడం లేదు.
Satya Sri: క్యాజువల్ లుక్స్ లో కేకపెట్టిస్తున్న సత్య శ్రీ.. క్యూట్ క్యూట్ ఫొటోలు
ఈనేపథ్యంలోనే డ్రాగన్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే, ఇన్నాళ్లు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వని మేకర్స్ ఇప్పుడు ఏకంగా డ్రాగన్ టీజర్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట. అది కూడా ఒక ప్రత్యేకమైన రోజున. ఆ రోజు ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ కి పండుగ లాంటి రోజు. అదే ఎన్టీఆర్ పుట్టిన రోజు. అవును. 2026 ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా డ్రాగన్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట.
అయితే, ఎన్టీఆర్ బర్త్ డే మే 20 కి ఒకరోజు ముందే అంటే మే 19న డ్రాగన్ సినిమా టీజర్ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. దీనికి సంబంధించి టీజర్ కట్టింగ్ పనులు కూడా ఇప్పటికే మోపడాలయ్యాయని సమాచారం. కేవలం 30 సెకన్ల పాటు ఉండే ఈ టీజర్ లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందట. ఆ ఒక్క టీజర్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచానుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది అని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ టీజర్ వచ్చాకా సోషల్ మీడియా రికార్డ్స్ ఒక్కటైనా మిగులుతాయా అనేది చూడాలి.
