Mummidivaram: సముద్రంలో పడవ బోల్తా.. ప్రాణాలతో బయటపడిన ఆరుగురు మత్స్యకారులు

సముద్రంలో వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి బోటు ఇంజన్ ఆగిపోయింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సముద్రంలో పడవ బోల్తా పడింది. అదృష్టవశాత్తూ అందులోని ఆరుగురు మత్సకారులు సురక్షితంగా బయటపడగలిగారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని మత్సకారులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సముద్రంలో వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి బోటు ఇంజన్ ఆగిపోయింది. బోటు సముద్రంలో మునిగిపోతుండగా కేకలు వేసిన మత్సకారులను రిలయన్స్ రిగ్ సిబ్బంది కాపాడారు. వారు నిన్నటి నుండి సముద్రంలో సుమారు 20 మైళ్ల దూరంలో రిగ్ వద్దనే చిక్కుకుపోవడంతో వారిని తీసుకువచ్చేందుకు స్థానిక మత్సకారులు ప్రయత్నిస్తున్నారు.

అలలు భారీగా ఎగిసిపడడం, వేగంగా గాలులు వీస్తుండడంతో అక్కడికి చేరుకోలేకపోతున్నారు. భైరవపాలెం, సావిత్రి నగర్‌కు చెందిన మత్సకారుల కుటుంబాలు అందోళనలోఉన్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే తమవారిని సురక్షితంగా తీసుకురావాలని కోరుతున్నాయి.

Also Read: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. చిన్నారి పరిస్థితి విషమం

ట్రెండింగ్ వార్తలు