Fire accident in Old city: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. బాలిక మృతి.. పలువురికి తీవ్రగాయాలు

సోఫాల తయారీగోదాంలో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబం..

Fire accident in Old city: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. బాలిక మృతి.. పలువురికి తీవ్రగాయాలు

Updated On : July 24, 2024 / 9:49 AM IST

పాతబస్తీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇవాళ తెల్లవారుజామున కూల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వ నగర్‌లో 4 అంతస్తుల బిల్డింగ్‌ గ్రౌండ్ ప్లోర్‌లోని సోఫా తయారీ గోదాంలో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్‌ వరకు మంటలు వ్యాపించాయి.

శివ ప్రియా(10) అనే అమ్మాయికి మంటలు అంటుకుని, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయాలపాలైన మరికొందరికి ఉస్మానియా ఆసుపత్రిలోని ఏ, బీ, సీ వార్డులో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ శ్రీనివాస్ (37) కు 100శాతం కాలిన గాయాలు అయ్యాయి.

నేహా మాధవి (24) ముఖానికి 30 శాతం, లక్ష్మి బాయి (70) ముఖానికి 30 శాతం, అమ్ములు ఉజుగరి అనే మహిళ ముఖానికి 30 శాతం కాలిన గాయాలు అయ్యాయి. కాగా, దాదాపు 20 మంది మంటల్లో చిక్కుకుని ప్రమాదం నుంచి చివరకు బయటపడ్డారు. స్థానికులు మంటలను ఆర్పేసే ప్రయత్నం చేశారు. ప్రమాదస్థలికి ఫైర్ సిబ్బంది ఆలస్యంగా చేరుకున్నట్లు తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చారు.

Also Read: సై అంటే సై.. వరంగల్‌లో పతాక స్థాయికి ఎమ్మెల్యే‌, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్‌..!