Prabhas Gives So Many Chocolates to Director Daughter in Movie Shooting
Prabhas : ప్రభాస్ ఫుడ్ పెట్టె విధానం గురించి అందరికి తెలిసిందే. షూటింగ్ కి వచ్చే సెలబ్రిటీలకు, తన ఇంటికి ఎవరు వచ్చినా చాలా వెరైటీలతో ఫుడ్ పెడతాడు. ప్రభాస్ పెట్టె ఫుడ్ గురించి అందరూ గొప్పగా చెప్తారు. ఫుడ్ విషయంలో మాత్రం ప్రభాస్ అస్సలు తగ్గేదేలే అన్నట్టు తెప్పిస్తాడని సెలబ్రిటీలు చెప్తారు.
ప్రస్తుతం ఇటీవలే కల్కి సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ నెక్స్ట్ రాజాసాబ్ తో రాబోతున్నాడు. ఆల్రెడీ సగం షూటింగ్ అవ్వగా ఆగస్టు నుంచి రాజాసాబ్ షూటింగ్ మళ్ళీ మొదలవ్వనుంది. తాజాగా రాజాసాబ్ షూటింగ్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనని డైరెక్టర్ మారుతి కూతురు తెలిపింది. డైరెక్టర్ మారుతి కూతురు హియ కూడా రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది.
Also Read : Director Maruthi Daughter : డైరెక్టర్ మారుతి కూతుర్ని చూశారా? ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా..
తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న హియ మీడియాతో రాజాసాబ్ షూటింగ్, ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ చాలా సరదాగా ఉంటారు. సెట్ లో ప్రభాస్ ఉంటే ఈజీగా తెలిసిపోతుంది. బాహుబలి నుంచి నేను ప్రభాస్ అభిమానిని. ఆయన సినిమాలు రిలీజ్ రోజు చూడాల్సిందే. నేను రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నాను. ఒకరోజు సెట్ లో నాకు చాక్లెట్ కావాలని నా పక్కనున్న వాళ్ళతో అరిచాను. అది ప్రభాస్ కి ఎలా తెలిసిందో కానీ కాసేపట్లో ప్రభాస్ ఒక ప్లేట్ నిండా చాక్లెట్స్ తీసుకొచ్చి నా ముందు పెట్టి నీకు ఏం కావాలో తీసుకో అని చెప్పారు. ఫుడ్ విషయంలో అంతలా ఉంటారు అని తెలిపింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఫుడ్ విషయంలో ప్రభాస్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అని మరోసారి అభినందిస్తున్నారు.