Dhamaka : టీవీ, యూట్యూబ్, ఈవెంట్స్.. మొదటిసారి ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ..

సాధారణంగా తన సినిమాల ప్రమోషన్స్ లో రవితేజ అంతగా కనిపించడు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ధమాకా సినిమా కోసం రవితేజ దాదాపు రెండు వారాల ముందు నుండే ప్రమోషన్ కార్యక్రమాల్లో

Dhamaka :  ఈ ఏడాది నటించిన రెండు సినిమాలూ డిజాస్టర్స్ అవడంతో నెక్స్ట్ మూవీ ‘ధమాకా’ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు మాస్ మహారాజా. ఎన్నడూ లేని విధంగా వరుస ప్రమోషన్స్ తో రిలీజ్ కు ముందే సినిమాను జనంలోకి తీసుకెళ్ళి 2022ను సక్సెస్ ఫుల్ గా ఎండ్ చేయాలని డిసైడయ్యాడు.

లాస్టియర్ ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్ పరంగా బ్రహ్మాండంగా బౌన్స్ బ్యాక్ అయిన రవితేజ ఈ ఏడాది రెండు వరుస డిజాస్టర్స్ తో ఫ్యాన్స్ ను చాలా నిరాశపరిచాడు. ఈ టైమ్ లో రవితేజకి సక్సెస్ చాలా అవసరం. అందుకే నెక్స్ట్ మూవీ ‘ధమాకా’ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అభిమానులకు, ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి రవితేజ డ్యూయల్ రోల్స్ హైలైట్స్ కాబోతున్నాయని టాక్.

సాధారణంగా తన సినిమాల ప్రమోషన్స్ లో రవితేజ అంతగా కనిపించడు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ధమాకా సినిమా కోసం రవితేజ దాదాపు రెండు వారాల ముందు నుండే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన ఇంతగా ఒక సినిమా కోసం మీడియా ముందుకు రావడం ఇదే అని ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు మాత్రమే కాకుండా, ఫ్యాన్స్ మీట్స్, సోషల్ మీడియా మీట్స్, టీవీ షోలలో గెస్ట్ గా వెళ్లడం కూడా చేశాడు. అసలు టీవీ వైపే చూడని రవితేజ ఢీ షోకి, బిగ్ బాస్ షోకి ధమాకా ప్రమోషన్స్ కి వెళ్లడం విశేషం.

ఇలా వరుసగా అన్ని రకాల ప్రమోషన్స్ చేస్తూ, తనతో పాటు హీరోయిన్, డైరెక్టర్, చిత్ర యూనిట్ ని కూడా ప్రమోషన్స్ లో భాగం చేస్తున్నాడు రవితేజ. ధమాకా మూవీతో ఈ 2022 సంవత్సరాన్ని సక్సెస్ ఫుల్ గా ఎండ్ చేయాలనే పట్టుదలగా ఉన్నాడు.

Hanu Raghavapudi : నన్ను నమ్మకూడదని ఇండస్ట్రీలో ప్రచారం చేశారు.. వాళ్ళు కనిపిస్తే డైరెక్ట్ గానే అడిగేస్తాను..

లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ‘ధమాకా’ మూవీ గ్యారెంటీ హిట్టనే ధీమా కనిపిస్తోంది మేకర్స్ లో. డిసెంబర్ 23న ధమాకా సినిమా థియేటర్స్ లోకి దిగిపోతుంది. ఈ గ్యాప్ లో మరింత గట్టిగా ప్రమోషన్స్ నిర్వహించాలని ధమాకా టీమ్ డిసైడ్ అయ్యింది. మరి అందరి అంచనాల్ని ధమాకా మూవీ ఏ రేంజ్ లో నిలబెడుతుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు