Tamil Actor Bharath Crime Thriller Miral Movie Releasing on May 17
Miral Movie : ప్రేమిస్తే సినిమాతో భరత్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో అలరించాడు. ఇప్పుడు భరత్ తెలుగు ప్రేక్షకులని భయపెట్టడానికి వస్తున్నాడు. భరత్, వాణి భోజన్ జంటగా తమిళ్ లో శక్తివేల్ దర్శకత్వంలో తెరకెక్కిన మిరల్ సినిమా 2022 లో తమిళ్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తమిళ్ ప్రేక్షకులను భయపెట్టింది.
Also Read : Love Me Trailer : ‘లవ్ మీ’ ట్రైలర్ వచ్చేసింది.. అందర్నీ చంపేసే దయ్యంతో హీరో ప్రేమ..
ఇప్పుడు మిరల్ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. తెలుగులో మిరల్ సినిమా రేపు మే 17న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై సీహెచ్ సతీష్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. ఇటీవల ఈ సినిమా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం భయపెడుతూ థ్రిల్లింగ్ గా సాగింది. ట్రైలర్ లో ఓ మాస్క్ వేసుకొని ఎవరో భయపెడుతున్నట్టు, ఏదో క్రైమ్ జరిగినట్టు చూపించారు. ఆ మాస్క్ ఏంటి? క్రైమ్ ఏంటి అని మంచి క్రైమ్ థ్రిల్లర్ భయపడుతూ చూడాలంటే మిరల్ సినిమాని రేపు థియేటర్స్ లో చూసేయండి.