Ravanasura : రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు?

ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో చుసిన వాళ్లంతా ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు.

Ravanasura :  మాస్ మహారాజ(Mass Maharaja) రవితేజ(Raviteja) నేడు రావణాసుర(Ravanasura) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, మేఘ ఆకాష్.. ఇలా అయిదుగురు హీరోయిన్స్, హీరో సుశాంత్(Sushanth) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్ లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రయూనిట్ కూడా రావణాసుర సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రమోషన్స్ గ్రాండ్ గా చేశారు. సుధీరవర్మ(Sudheer Varma) దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. ఇక్కడ కూడా కొన్ని చోట్ల స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో చుసిన వాళ్లంతా ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు. రవితేజ నెగివ్ షేడ్స్ లో అదరగొట్టాడు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

ట్రెండింగ్ వార్తలు