RGV : నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి..

తాజాగా ఆర్జీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్‌ను షేర్‌ చేశాడు. నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయంటున్నాడు. ఆర్జీవీ ఓ కుక్కని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఉన్న ఫోటోని తన........

 

RGV :  సెన్సేషన్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో, తన ట్వీట్స్ తో, తన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దేని గురించి అయినా తనకి ఇష్టమొచ్చింది మాట్లాడేస్తాడు ఆర్జీవీ. అయితే ఆర్జీవీ ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. నాకు అందరిలాగా ఎమోషన్లు, ఫీలింగ్స్ లేవు. నేను ఎవరికీ అటాచ్ అవ్వను అంటూ ఉంటారు. ప్రేమ, బాధ, కోపం ఇలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు అని బంధాలకి దూరంగా ఉంటానని చెప్తూనే ఉంటాడు ఆర్జీవీ.

Movies : తెలంగాణలో ఐదో షోకి పర్మిషన్..

అయితే తాజాగా ఆర్జీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్‌ను షేర్‌ చేశాడు. నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయంటున్నాడు. ఆర్జీవీ ఓ కుక్కని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఉన్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి నాకు కూడా ఫీలింగ్స్‌ ఉన్నాయి అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గతంలో చాలాసార్లు తనకు ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఇతర జీవరాశులపై ఎలాంటి ప్రేమ లేదని చెప్పిన వర్మ లేటెస్ట్‌ ఫోటోతో అందరికి షాక్‌ ఇచ్చాడు. ఇలా షాకివ్వడం ఆర్జీవికి మామూలే కదా అని అంటున్నారు నెటిజన్లు.

ట్రెండింగ్ వార్తలు