Rhino Horn Poached: అస్సాంలో ఖడ్గమృగం కొమ్మును కోసేసిన వేటగాళ్లు: 2017 తరువాత మొదటి ఘటన

2017 నుంచి ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, ఇతర వన్యమృగాల వేట దాదాపుగా తగ్గింది. అయితే దాధాపు ఐదు సంవత్సరాల అనంతరం ఒక మగ ఖడ్గమృగం కొమ్మును వేటగాళ్లు అపహరించడం ఇదే తొలిసారి.

Rhino Horn Poached: అస్సాంలోని ఒరాంగ్ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయంలో ఒక ఖడ్గమృగం కొమ్మును వేటగాళ్లు అపహరించిన ఘటన సంచలనంగా మారింది. ఖడ్గమృగాల కొమ్ముల అక్రమ రవాణాపైపై కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చింది. దీంతో 2017 నుంచి ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, ఇతర వన్యమృగాల వేట దాదాపుగా తగ్గింది. అయితే దాధాపు ఐదు సంవత్సరాల అనంతరం ఒక మగ ఖడ్గమృగం కొమ్మును వేటగాళ్లు అపహరించడం ఇదే తొలిసారి. ఒరాంగ్ జాతీయ పార్క్ లో మే 9న ఏనుగుల పర్యవేక్షణ బృందం సిబ్బంది అడవిలో పహారా కాస్తుండగా..మధ్య వయసున్న ఒక మగ ఖడ్గమృగం..గాయంతో కనిపించింది. మొదట అది చూసిన అటవీ సిబ్బంది ఇతర జంతువుల దాడిలో ఖడ్గమృగం గాయపడి ఉంటుందని భావించారు. అయితే కొంత అనుమానం కలిగిన సిబ్బంది..పరీక్షించి చూడగా..అది వేటగాళ్ల పనిగా గుర్తించారు.

Read Other: Petrol price in hyderabad: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. ఒక్క హైదరాబాద్‌లోనే..

అనంతరం ఖడ్గమృగానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి..వైద్యుల సమక్షంలో పర్యవేక్షించారు. జంతువు శరీరంపై ఎక్కడా చిన్న గాయం కూడా లేదని, వేటగాళ్ళే ఖడ్గమృగానికి మత్తు మందు ఇచ్చి కొమ్మును తొలగించినట్లు మంగళ్‌దోయ్ డివిజన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, ప్రదీప్త బారుహ్ పేర్కొన్నారు. గాయపడిన ఖడ్గమృగానికి వైద్యులు చికిత్స అందించారని, ప్రస్తుతం నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అది కోలుకుంటుందని ప్రదీప్త తెలిపారు. బ్రహ్మపుత్ర నదికి ఉత్తర తీరంలో ఉన్న ఒరాంగ్ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయంలో అనేక వన్యమృగాలు ఉన్నాయి. వేటగాళ్ల బారి నుంచి వన్యమృగాలను రక్షించేందుకు అటవీశాఖ సిబ్బంది నిరంతరం గస్తీ తిరుగుతుంటారు.

Read Others:Elephant on Tracks: రైలు పట్టాలపై ఏనుగు: చివరి క్షణంలో స్పందించిన లోకో పైలట్

గత ఐదేళ్లుగా ఈ జాతీయ పార్క్ లో వేటగాళ్ల తాకిడి తగ్గి జంతువుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఖడ్గమృగాలు నిలయమైన అస్సాంలోని..ఒరాంగ్ జాతీయ పార్క్ లో 2018లో ఖడ్గమృగాల సంఖ్య 101గా ఉండగా.. ఇటీవల కాలంలో ఆ సంఖ్య 125కి చేరింది. ఈ ఏడాది జనవారిలోనూ ఒక ఖడ్గమృగం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మృతి చెందిన ఖడ్గమృగం కొమ్ము కూడా తొలగించడం వేటగాళ్ల పనిగా భావించినా..అందుకు రుజువైన కారణాలు లభ్యం కాలేదు. అయితే ప్రస్తుత ఘటనలో కచ్చితంగా వేటగాళ్ల హస్తం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు