Rishabh Pant : శుభ‌వార్త‌.. 140కి.మీ వేగంతో వ‌స్తున్న బంతుల‌ను ఎదుర్కొంటున్న పంత్‌.. త్వ‌ర‌లోనే..

గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన భార‌త వికెట్ కీప‌ర్ రిషబ్‌పంత్ (Rishabh Pant) అనుకున్న‌దాని కంటే చాలా వేగంగా కోలుకుంటున్నాడు. కొద్ది నెల‌లుగా అత‌డు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(National Cricket Academy)లో పున‌రావాసం పొందుతున్నాడు.

Rishabh Pant

Rishabh Pant practice : గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన భార‌త వికెట్ కీప‌ర్ రిషబ్‌పంత్ (Rishabh Pant) అనుకున్న‌దాని కంటే చాలా వేగంగా కోలుకుంటున్నాడు. కొద్ది నెల‌లుగా అత‌డు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(National Cricket Academy)లో పున‌రావాసం పొందుతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న ఫిట్‌నెస్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉన్నాడు.

కాగా.. ప్ర‌స్తుతం అత‌డి ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 140కి.మీ ల వేగంతో దూసుకువ‌స్తున్న బంతుల‌ను చాలా చ‌క్క‌గా ఎదుర్కొంటున్న‌ట్లు ఎన్‌సీఏ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్ప‌టికిప్పుడే రీ ఎంట్రీ ఇచ్చేంత ఫిట్‌నెస్ అయితే సాధించ‌లేద‌ని వైద్యులు చెబుతున్నారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ పంత్ చాలా వేగంగా కోలుకుంటున్న‌ట్లు మాత్రం చెబుతున్నారు. పంత్ ఇలా వేగంగా కోలుకోవ‌డం ప‌ట్ల అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

MS Dhoni’s Daughter Ziva : ధోని కుమార్తె జీవా ఏ స్కూల్‌లో చదువుతుందంటే…ఆ స్కూలు ఫీజు తెలిస్తే షాక్ అవుతారు

అయితే.. ఈ ఏడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పంత్ ఆడ‌డం అనుమాన‌మే. ప్ర‌స్తుతం పంత్ కోలుకునే విధానాన్ని ప‌రిశీలిస్తే అత‌డు మ‌రో రెండు మూడు నెల‌ల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఏడాది స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రిగే టెస్టు సిరీస్ నాటికి అత‌డు రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది. అటు కేఎల్‌ రాహుల్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అత‌డు ఆసియాక‌ప్‌లో రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు తెలిపాయి.

గ‌తేడాది డిసెంబ‌ర్‌లో రిష‌బ్ పంత్ ఢిల్లీ నుంచి ఉత్త‌రాఖండ్‌కు కారులో వెలుతుండ‌గా రూర్కీ స‌మీపంలో అత‌డు ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో మంట‌లు చెల‌రేగాయి. పంత్ అద్దం ప‌గ‌ల‌గొట్టుకుని బ‌య‌ట‌కు దూకేశాడు. దీంతో అత‌డి త‌ల‌, మోకాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలు ఫ్రాక్చ‌ర్ అయ్యింది. వీపు భాగం కాలిపోయింది. మోకాలికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. గాయాల నుంచి కోలుకున్న పంత్ ప్రాక్టీస్ మొద‌లెట్టాడు.

Jesus Alberto Lopez Ortiz : విషాదం.. సాక‌ర్ ఆట‌గాడిని బ‌లితీసుకున్న మొస‌లి

ట్రెండింగ్ వార్తలు