RRR : అంచ‌నాలు పెంచేలా.. అదిరిపోయే ప్లాన్ చేసిన జక్కన్న..

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ ఓ వీడియోను సిద్ధం చేస్తుంది. దీనిని వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబ‌ర్ 13న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు కొద్ది రోజులుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా రిలీజ్ అవడానికి అటు ఇటుగా రెండు నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై చిత్ర బృందం దృష్టిపెట్టింది. ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

RRR Dosti : ‘పులికి, విలుకాడికి’.. రామ్, భీమ్ ‘దోస్తీ’..

డైరెక్టర్ రాజమౌళి కావడంతో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ఇండస్ట్రీ వర్గాల అంచనా.. మరోవైపు అంచనాలను మ‌రింత పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు జక్క‌న్న‌. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో కూడిన డైలాగ్స్‌తో ఉండేలా ఓ స్పెషల్ ప్రోమో వీడియో కట్ చేసే పనిలో ఉన్నారట రాజమౌళి. ఈ వీడియోను వచ్చే నెల ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.

RRR UK Schedule : ఎండ్ కొచ్చేసరికి ఎనర్జీ ట్రిపుల్ అయ్యిందిగా..

ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచుతుందని అంటున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ‘దోస్తీ’ సాంగ్ పలు రికార్డులను తిరగరాసింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ. హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట సినిమాపై అంచనాలను పెంచింది. అంతేకాదు, ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది కూడా. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ స‌త్తా చాటుతుంది.

NTR – Ram Charan : ‘సీటూ హీటెక్కుతుంది.. బ్రెయినూ హీటెక్కుతుంది’..

ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌లో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 19తో ఉక్రెయిన్‌ షెడ్యూల్ కంప్లీట్ కానుందనేది తాజా సమాచారం.

ట్రెండింగ్ వార్తలు