Rajasthan Cabinet : ఢిల్లీ వేదికగా రాజస్తాన్ పంచాయతీ.. సోనియాతో సచిన్ పైలట్ భేటీ!

ఢిల్లీ వేదికగా రాజస్తాన్‌ కేబినెట్ పంచాయితీ కొనసాగుతోంది. రాజస్థాన్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో సచిన్ పైలట్ కలిశారు.

Rajasthan cabinet reshuffle : ఢిల్లీ వేదికగా రాజస్తాన్‌ కేబినెట్ పంచాయితీ కొనసాగుతోంది. రాజస్థాన్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో ఆ పార్టీ నేత సచిన్ పైలట్ కలిశారు. శుక్రవారం (నవంబర్ 12) ఢిల్లీలో సోనియాతో 45 నిముషాల పాటు ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సచిన్ పైలట్ మాట్లాడుతూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. 2023లో రాజస్థాన్‌లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని అన్నారు.

తనవర్గం ఎమ్మెల్యేలకు కేబినెట్‌‌లో స్థానం కోసం ఏడాది కాలంగా సచిన్ పైలట్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శీ కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ అజయ్ మాకెన్‌ను అశోక్ గెహ్లాట్ కలిశారు.  రాజస్తాన్‌లో 30 మంది మంత్రుల మండలిలో ప్రస్తుతం 9 ఖాళీలు ఉన్నాయి. రాజస్థాన్ మంత్రి మండలిలో సీఎం గెహ్లాట్‌తో సహా 21 మంది మంత్రులు ఉన్నారు. గత ఏడాదిలో జులైలో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లట్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ మద్దతుదారులు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

ఈ కూర్పులో తమవర్గం వారికి మంత్రిపదవులు ఇవ్వాలని సచిన్ పైలట్ ఎప్పటినుంచో పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ వర్గీయులకు నలుగురికి… గెహ్లట్ సన్నీహితులకు ఐదుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. రెండు గ్రూపులతో కాంగ్రెస్ హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. సుదీర్ఘ చర్చల జరిపిన తర్వాతే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాదిలో గెహ్లాట్, పైలట్ మధ్య రాజీ సందర్బంగా ప్రభుత్వంలో పైలట్ మద్దతుదారులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తానని ప్రియాంక గాందీ హామీ ఇచ్చారు.
Read Also :  Sanjay dutt : సంజయ్ దత్‌కు అరుదైన గౌరవం.. ఆఫ్రికా దేశం జాంజిబార్ కి టూరిజం అంబాసిడర్ గా ఎంపిక

ట్రెండింగ్ వార్తలు