Salaar Teaser : ‘సలార్’కి ‘కేజిఎఫ్’కి లింక్ ఉందా? కేజిఎఫ్ ముగింపు.. సలార్ ఆరంభం.. అందుకే టీజర్ ఆ టైంకి రిలీజ్??

తాజాగా టీజర్ రిలీజ్ ని జులై 6 పొద్దున్నే 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించడంతో అభిమానులు కేజిఎఫ్ సినిమాకు, దీనికి ఉన్న లింక్స్ ని కొత్త కొత్తగా కనిపెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఈ టీజర్ రిలీజ్ టైంతో నిజంగానే సలార్ కి కేజిఎఫ్ కి లింక్ ఉందని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు.

Salaar movie and KGF Movie having links fans and netizens posted interesting things

Salaar KGF : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నుంచి రాబోతున్న సినిమా ‘సలార్’. ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు చిత్ర యూనిట్. తాజాగా ప్రభాస్ అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సలార్ టీజర్ ని జులై 6 ఉదయం 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు ప్రభాస్ ని వెనక నుంచి చూపిస్తూ ఓ మాస్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

అయితే కేజిఎఫ్ సినిమాకు, సలార్ సినిమాకు లింక్ ఉందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు ఏదో ఒక లింక్ ఉంటుందని, ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై చిత్రయూనిట్ మాత్రం స్పందించట్లేదు. అయితే తాజాగా టీజర్ రిలీజ్ ని జులై 6 పొద్దున్నే 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించడంతో అభిమానులు కేజిఎఫ్ సినిమాకు, దీనికి ఉన్న లింక్స్ ని కొత్త కొత్తగా కనిపెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఈ టీజర్ రిలీజ్ టైంతో నిజంగానే సలార్ కి కేజిఎఫ్ కి లింక్ ఉందని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు.

కేజిఎఫ్ సినిమా క్లైమాక్స్ లో యశ్ ఓడ సముద్రంలో మునిగిపోయేముందు అందులో టైం ఉదయం 5 గంటల 2 నిముషాలు చూపిస్తుంది. 10 నిమిషాల్లో యశ్, ఓడ పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. అంటే 5 గంటల 12 నిమిషాలకు సలార్ బయటకి వస్తాడు, కేజిఎఫ్ ముగింపు సలార్ ఆరంభం అని ట్విట్టర్ లో పోస్టులు చేస్తున్నారు. అందుకే టీజర్ ని ఆ టైంకి రిలీజ్ చేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

Tamannaah : బోల్డ్ సీన్స్ చేస్తే హీరోలని ఎందుకు అడగరు? మమ్మల్ని మాత్రమే విమర్శిస్తారు..

ఇక కొంతమంది అయితే ఆల్ఫాబెట్స్ లో 5 అంటే E అని, 12 అంటే L అని తీసుకొని EL Dorado అని పోస్ట్ చేస్తున్నారు. కేజిఎఫ్ సినిమాలో యశ్ గురించి చెప్పేటప్పుడు EL Dorado అని చెప్తారు. దీంతో ఈ సినిమాలో కూడా ప్రభాస్ ని అదే రేంజ్ లో చూపిస్తారని భావిస్తున్నారు. ఇలా అభిమానులు, ప్రేక్షకులు ఎవరికీ తోచినట్టు వాళ్ళు కేజిఎఫ్ సినిమాకు, సలార్ సినిమాకు లింక్స్ కలుపుతూ సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే ఈ రెండు సినిమాలకి లింక్ ఉంటే మాత్రం సినిమా బ్లాక బస్టర్ హిట్ అయి సరికొత్త రికార్డులని సెట్ చేయడం అవ్వడం ఖాయం.

ట్రెండింగ్ వార్తలు